న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ తాము ఎంచుకున్న ముగ్గురు క్రికెటర్ల పేర్లను బీసీసీఐకి సమర్పించింది. ఇప్పటికే భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లను ఎంచుకున్న అహ్మదాబాద్ మూడో ప్లేయర్‌గా భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్ మాజీ సభ్యుడు ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని అహ్మదాబాద్ పట్టుదల కనబరిచినా ఇషాన్ ఆసక్తి చూపకపోవడంతో గిల్‌వైపు ఆ ఫ్రాంచైజీ మొగ్గు చూపింది.
హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌లకు రూ. 15 కోట్ల చొప్పున... గిల్‌కు రూ. 7 కోట్లు అహ్మదాబాద్ చెల్లించనున్నట్లు సమాచారం. పంజాబ్‌కు చెందిన 22 ఏళ్ల శుబ్‌మన్ గిల్ భారత్ తరఫున 10 టెస్టులు, 3 వన్డేలు ఆడినా అంతర్జాతీయ టి20ల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. 2018 నుంచి 2021 వరకు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 58 మ్యాచ్‌లు ఆడిన గిల్ 10 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 1,417 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment