స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు టిమ్ సౌథీ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా గత ఏడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ కైల్ జేమీసన్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పటివరకు 16 టెస్టులు ఆడిన జేమీసన్ 72 వికెట్లు సాధించాడు. మరోవైపు కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అదే విధంగా ఈ జట్టులో స్పిన్నర్ ఆజాజ్ పటేల్, మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌కు చోటు దక్క లేదు.
ఇక భారత్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వేల్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇక ఈ హోం సిరీస్‌లో భాగంగా కివీస్ ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడనుంది. అయితే ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్(పింక్‌బాల్ టెస్టు)గా జరగనుంది. ఈ మ్యాచ్ తౌరంగ వేదికగా ఫిబ‍్రవరి 16 నుంచి 20 వరకు జరగనుంది.
ఇంగ్లండ్‌తో టెస్టులకు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.
చదవండి: IND Vs AUS: కింగ్ ఈజ్ బ్యాక్.. జిమ్‌లో కోహ్లి కసరత్తులు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment