న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ జోరు కనబరుస్తుంది. ఇప్పటికే తొలి టెస్టు కైవసం చేసుకున్న ఇంగ్లండ్ రెండో టెస్టులోనూ ఆకట్టుకుంది. తొలి టెస్టు గెలవడంలో కీలకపాత్ర పోషించిన రూట్ రెండో టెస్టులోనూ అదే జోరు కనబరుస్తున్నాడు. రెండో టెస్టులో సెంచరీతో మెరిసిన రూట్ మొత్తంగా 211 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 176 పరుగులు చేసి ఔటయ్యాడు. అతనికి ఓలీ పోప్(239 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సహకరించాడు. మూడో వికెట్‌కు ఈ జోడి 187 పరుగులు జోడించడం విశేషం.
ఇక రూట్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక సిక్సర్ ఉండగా.. అది ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే రూట్ ఇన్నింగ్స్‌లో సిక్సర్లు చాలా తక్కువ. ఒకవేళ కొట్టినా అన్నీ సంప్రదాయ సిక్సర్లు ఉంటాయి.తాజాగా టిమ్ సౌథీ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌లో సిక్సర్‌ను తరలించాడు. అయితే అది సిక్సర్ వెళుతుందని రూట్ కూడా అనుకోలేదనుకుంటా.. అందుకే అంతలా ఆశ్యర్యపోయాడు. రూట్ సిక్సర్ చూసిన సౌథీకి మతి పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ప్రస్తుతం డారిల్ మిచెల్ 32, మాట్ హెన్రీ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగడంతో న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 238 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
A quiet start to the morning in Nottingham...
— England Cricket (@englandcricket) June 13, 2022
Scorecard & Videos: https://t.co/GJPwJC59J7
🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/Fjz96fl2SZ
Comments
Please login to add a commentAdd a comment