ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. టీమిండియాతో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో 888 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోగా.. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక తొలి స్థానంలో 903 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ(805 పాయింట్లు), విరాట్ కోహ్లి( 775 పాయింట్లు) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో హాఫ్ సెంచరీలతో మెరిసిన లాథమ్ 726 పాయింట్లతో 5 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న లంక కెప్టెన్ కరుణరత్నే 4 స్థానాలు ఎగబాకి పాయింట్లతో ఏడో స్థానంలో నిలలిచాడు.
చదవండి: రెండో టెస్టుకు సాహా దూరం.. కేఎస్ భరత్‌కు అవకాశం!
ఇక బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది స్థానాలు ఎగబాకి పాయింట్లతో తొలిసారి టాప్ 5లోకి దూసుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన షాహిన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఆకట్టుకున్న కైల్ జేమీసన్ 6 స్థానాలు ఎగబాకి 776 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ 840 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 763 పాయింట్లతో బుమ్రా ఒకస్థానం దిగజారి 10వ స్థానంలో నిలిచాడు.
చదవండి: Test Cricket: ఇది ఆటంటే.. టెస్టు మజా ఏంటో చూపించింది
Afridi, Jamieson, Latham and Karunaratne on the charge 👊
— ICC (@ICC) December 1, 2021
All the latest changes in the @MRFWorldwide Test player rankings 👉 https://t.co/sBZWT92hhH pic.twitter.com/4dHZoUV67z
Comments
Please login to add a commentAdd a comment