IPL 2022: RCB Praise Massage Therapist Navnita Gautam Fans Ask Where Kyle Jamieson - Sakshi
Sakshi News home page

IPL 2022: ఆర్‌సీబీలో మహిళా థెరపిస్ట్‌.. కైల్‌ జేమిసన్‌తో సంబంధమేంటి?

Published Tue, Mar 8 2022 10:58 AM | Last Updated on Tue, Mar 8 2022 2:38 PM

RCB Praise Massage Therapist Navnita Gautam Fans Ask Where Kyle Jamieson - Sakshi

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఉన్న క్రేజ్‌ వేరు. ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేకపోయినప్పటికి ఫెవరెట్‌గానే కనిపిస్తోంది. ప్రతీసారి పేపర్‌పై బలంగా కనిపించే ఆర్‌సీబీ ఆటలో మాత్రం తడబడుతుంది. ఈ సీజన్‌లో కోహ్లి కెప్టెన్‌గా తప్పుకోవడంతో దినేష్‌ కార్తిక్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. మరి నూతన సారధ్యంలో ఆర్‌సీబీ కప్‌ కొడుతుందా అన్నది చూడాలి.

ఈ విషయం పక్కనబెడితే.. ఆర్‌సీబీ యాజమాన్యం అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని తన ట్విటర్‌ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. '' ముందుగా ఆర్‌సీబీ జట్టులో థెరపిస్ట్‌గా పనిచేస్తున్న నవనీతా గౌతమ్‌కు ప్రత్యేక అభినందనలు. ప్రపంచంలో ఉన్న మహిళలందరూ నిజంగా సూపర్‌ హీరోలే.. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'' అంటూ రాసుకొచ్చింది.ఆర్‌సీబీ నవ్‌నీతా గౌత్‌మ్‌కు శుభాకాంక్షలు చెప్పగానే సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఒక విషయాన్ని గుర్తుచేశారు. ''నవనీతా గౌతమ్‌.. కైల్‌ జేమిసన్‌ ఎక్కడ?'' అంటూ అడిగారు. అదేంటి నవ్‌నీతాకు, జేమిసన్‌కు రిలేషన్‌ ఏంటి అని ఆశ్చర్యపోకండి. 

విషయంలోకి వెళితే.. గతేడాది సీజన్‌లో అబుదాబి వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల నష్టానికి 53 పరుగులతో ఆడుతుంది. బ్రేక్‌ సమయంలో కెమెరామెన్‌ ఒకసారి ఆర్‌సీబీ కూర్చొన్న డగౌట్‌ వైపు తిప్పాడు. అక్కడ ఒక ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కైల్‌ జేమిసన్‌ ప్యాడ్లు కట్టుకొని సిద్ధంగా ఉండగా.. అతనికి వెనకాల నవనీతా గౌతమ్‌ కూర్చొని ఉంది.వారిద్దరో ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ కెమెరా వారివైపు చూసేసరికి ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ చిరునవ్వులు ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని అభిమానులు మరోసారి తాజాగా గుర్తుచేసుకుంటూ ఫన్నీ కామెంట్‌ చేశారు.

ఎవరీ నవనీతా గౌతమ్‌..
కెనడాలోని వాంకోవర్‌లో ఏప్రిల్‌ 11, 1992లో నవనీతా గౌతమ్‌ జన్మించింది. థెరపిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన నవనీతా గ్లోబల్‌ టి20 కెనడా టీంకు మొదట మసాజ్‌ థెరపిస్ట్‌గా సేవలందించింది. ఆ తర్వాత ఆసియా కప్‌ క్యాంపెయిన్‌ సందర్భంగా భారతీయ మహిళా బాస్కెట్‌బాల్‌ జట్టుకు స్టాఫ్‌ సపోర్ట్‌గా వ్యవహరించింది. ఇక 2019లో ఆర్‌సీబీలో స్పోర్ట్స్‌ మసాజ్‌ థెరపిస్ట్‌గా జాయిన్‌ అయింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న జట్లలో ఏకైక మహిళా థెరపిస్ట్‌ నవనీతా గౌతమ్‌ మాత్రమే.

చదవండి: IPL 2022: ధోని క్రేజ్‌ తగ్గలేదనడానికి మరో సాక్ష్యం

Cristiano Ronaldo: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement