Irfan Pathan Pointed Out Flaw In Opener Shubman Gill: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అవుటైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తొలి ఇన్నింగ్స్‌లో అర్దసెంచరీ సాధించిన గిల్ కైల్ జామీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అదే రీతిలో సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా వికెట్ సమర్పించుకున్నాడు. కైల్ జెమీషన్ వేసిన అద్భుత స్వింగ్ డెలివరీకి గిల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఈ క్రమంలో గిల్ అవుటైన తీరుపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్ స్పందించాడు.
స్టార్ స్పోర్ట్స్ షోలో గిల్ బ్యాటింగ్ స్టైల్ గురించి పఠాన్ మాట్లాడూతూ.. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పు చేసుకోవాలని సూచించాడు. "అతడు ముఖ్యంగా పిచ్-అప్ డెలివరీలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు. అతడిలో చాలా ప్రతిభ దాగి ఉంది. ఆ బంతులను అతడు ఎదరుర్కొంటే చాలు.. తిరుగు ఉండదు. గిల్ అవుటైన విధానం గమనిస్తే.. అతడి రెండు పాదాలు ఒకే చోట ఉన్నాయి. అందుకే బ్యాట్‌తో బంతిని ఆపేందుకు సమయం పట్టింది.
ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆడటం అంత సులభంకాదు. కాన్పూర్‌లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతోంది. అంతేకాకుండా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌పై సాధారణంగా ఒత్తిడి ఉంటుంది. దీంతో తొందరగా పెవిలియన్‌కు చేరుతుంటారు. గిల్ మాత్రం తన బ్యాటింగ్ టెక్నిక్‌పై దృష్టిసారించాలి. అప్పుడే మంచి ఫలితాలు రాబట్టగలడు" అని పఠాన్ పేర్కొన్నాడు. అదే విధంగా భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా మాట్లాడూతూ.. గిల్‌కు ఉన్న బ్యాటింగ్ టెక్నిక్‌కు ఓపెనింగ్ కంటే మిడిల్ ఆర్డర్‌లో అవకాశం ఇస్తే బాగుటుందని అభిప్రాయపడ్డాడు.
చదవండి: Trolls On Ajinkya Rahane: నీకిది తగునా రహానే.. బై బై చెప్పే సమయం ఆసన్నమైంది!
Comments
Please login to add a commentAdd a comment