
Kyle Jamieson 3rd Bowler Fewest Balls Taken For 50 Test Wickets.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. 20వ శతాబ్దం నుంచి చూసుకుంటే అత్యంత తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న జాబితాలో జేమీసన్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్‌ను ఔట్ చేయడం ద్వారా జేమీసన్ టెస్టుల్లో 50వ వికెట్ తీసుకున్నాడు.
చదవండి: Axar Patel: వారెవ్వా అక్షర్ పటేల్.. టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో బౌలర్‌గా
జేమీసన్ 50 వికెట్ల మార్క్ అందుకునేందుకు 1865 బంతులు తీసుకొని మూడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలాండర్(1240 బంతుల్లో 50 వికెట్లు) తొలి స్థానంలో.. 1844 బంతుల్లో 50 వికెట్లు తీసిన ఆసీస్ స్పీడస్టర్ బ్రెట్ లీ రెండో స్థానంలో ఉన్నారు. ఇక 1880 బంతుల్లో 50 వికెట్లు తీసిన ఫ్రాంక్ టైసన్(ఇంగ్లండ్).. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్(1943 బంతుల్లో 50 వికెట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
అత్యంత తక్కువ టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి న్యూజిలాండ్ పేసర్‌గా కైల్ జేమిసన్ నిలిచాడు. ఇంతకముందు 50 వికెట్ల మార్క్‌ను చేరుకునేందుకు షేడ్ బాండ్ 12 టెస్టులు.. క్రిస్ మార్టిన్ 13 టెస్టులు తీసుకున్నారు.
చదవండి: పేర్లలో కన్ఫూజన్.. ఈసారి జడేజాదే పైచేయి
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడోరోజు ఆట ముగిసేసమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment