
New Zealand vs England- Test Series: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ కైలీ జెమీషన్‌కు గాయం తిరగబెట్టింది. దీంతో అతడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా జెమీషన్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో జూన్ నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.
నొప్పి లేకున్నా
ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం జెమీషన్ కోలుకోవడంతో అతడిని స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 16 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో స్కానింగ్‌కు వెళ్లిన జెమీషన్‌కు ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. పెద్దగా నొప్పి లేకపోయినప్పటికీ.. అతడిని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పాడు.
అప్పుడే క్లారిటీ
జెమీషన్‌కు శుక్రవారం మరోసారి సీటీ స్కాన్ నిర్వహించిన తర్వాతే ఫిబ్రవరి 24న ఆరంభం కానున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండే విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాడు. కాగా జట్టులో కీలక బౌలర్ అయిన జెమీషన్ దూరం కావడంతో కివీస్‌కు ఎదురుదెబ్బే.
డ్రాగా మ్యాచ్
ఇక ఇంగ్లండ్‌తో హామిల్టన్‌లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో జెమీషన్ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మిగతా వాళ్లతో పోలిస్తే అత్యంత పొదుపుగా(ఎకానమీ 4.30) బౌలింగ్ చేశాడు. రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది.
సీఎస్‌కే కలవరం
ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జెమీషన్‌ను గాయాల బెడద వేధిస్తుండటం సీఎస్‌కేను కలవరపెడుతోంది. దీంతో త్వరలోనే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండు టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్!
WPL 2023: దాదాపు పదేళ్ల తర్వాత ‘అమ్మ’ నుంచి మళ్లీ ఆటకు.. మెరిసిన వైజాగ్ తేజం