10 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా స్టార్‌ బౌలర్‌ | New Zealand Announced Squad For ODI Series Against Bangladesh; Lockie Ferguson Takes Helm As Captain - Sakshi
Sakshi News home page

NZ vs BAN: 10 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా స్టార్‌ బౌలర్‌

Sep 2 2023 12:50 PM | Updated on Sep 2 2023 1:04 PM

Lockie Ferguson to lead New Zealand in Bangladesh this month - Sakshi

బంగ్లాదేశ్‌తో జరిగే వన్డేసిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు టామ్‌ లాథమ్‌, టిమ్‌ సౌథీ వంటి చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లకు కివీస్‌ సెలక్టర్లు విశ్రాంతిని ​కల్పించారు. ఈ క్రమంలో బంగ్లాతో సిరీస్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్‌ ఎంపికయ్యాడు. ఫెర్గూసన్‌ కివీస్‌ సారథ్య బాధ్యతలు చేపట్టడం ఇదే తొలి సారి.

ఇక ఇదే విషయంపై న్యూజిలాండ్‌ హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ స్పందిస్తూ.. "లాకీ ఫెర్గూసన్‌ అంతర్జాతీయ స్ధాయిలో చాలా అనుభవం ఉంది. ఇప్పటివరకు బౌలింగ్‌ యూనిట్‌ను ముందుకు నడిపించిన లాకీకి.. ఓవరాల్‌ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. అతడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని నేను భావిస్తున్నా" అని పేర్కొన్నాడు.

10 ఏళ్ల తర్వాత బంగ్లాకు..
కాగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుండడం 10 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారి ఈ పర్యటనలో భాగంగా కివీస్‌ మూడు వన్డేలు, రెండు టెస్టులు అతిథ్య బంగ్లాదేశ్‌తో ఆడనుంది. కివీస్‌ రెండు దఫాలుగా బంగ్లాదేశ్‌ టూర్‌కు వెళ్లనుంది. తొలి దశ పర్యటనలో మూడు వన్డేలు న్యూజిలాండ్‌ ఆడనుంది.

సెప్టెంబర్‌ 21న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. అనంతరం నవంబర్‌ 28 నుంచి టెస్టు సిరీస్‌ మొదలు కానుంది.  ఇక బంగ్లా టూర్‌కు దూరమైన డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ ,టిమ్ సౌథీ.. వన్డే ప్రపంచకప్‌కు అందుబాటులో రానున్నారు.

న్యూజిలాండ్ వన్డే జట్టు: లాకీ ఫెర్గూసన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, చాడ్ బోవ్స్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైల్ జామీసన్, కోల్ మెక్‌కాంచీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, రాచిన్ రవీంద్ర, రచిన్ రవీంద్ర, విల్ యంగ్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement