![New Zealand Announce Squad For Bangladesh ODIs - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/7/newzealand.jpg.webp?itok=JbWYFdTg)
వన్డే ప్రపంచకప్-2023 తర్వాత తొలి వైట్‌బాల్ సిరీస్‌కు న్యూజిలాండ్ సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కివీస్ తలపడనుంది. ఈ సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో టామ్ లాథమ్‌ను సారధిగా సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఇక దేశీవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లెగ్ స్పిన్నర్ ఆదిల్ అశోక్, జోష్ క్లార్క్‌సన్, విల్ ఓ'రూర్క్‌లకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా వన్డే వరల్డ్‌ప్‌లో దుమ్మురేపిన యువ సంచలనం రచిన్ రవీంద్ర కూడా బంగ్లా సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడు. డిసెంబర్ 17న డునెడిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
బంగ్లాతో వన్డేలకు కివీస్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఆది అశోక్, ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, రచిన్ రవీంద్ర, ఇష్ సోధి, విల్ యంగ్.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment