సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ వైట్‌బాల్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 189 బంతుల్లో 11 ఫోర్లతో విలియమ్సన్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టుల్లో విలియమ్సన్‌కు ఇది 29వ సెంచరీ. తద్వారా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆసీస్ దిగ్గజం బ్రాడ్‌మన్ రికార్డును విలియమ్సన్ సమం చేశాడు.
విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 29 సెంచరీలు సాధించగా.. బ్రాడ్‌మన్ పేరిట కూడా 29 టెస్టు సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా మరో అరుదైన రికార్డును కేన్ మామ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి కివీస్ క్రికెటర్‌గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు.
ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకపై కూడా కేన్ రెండు టెస్టుల్లో వరుసగా రెండు సార్లు సాధించాడు. కాగా విలియమ్సన్‌కు ఓవరాల్‌గా ఇది 42వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక బంగ్లాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ 104 పరుగులు చేశాడు. 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కివీస్ 262 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment