
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై 88 పరుగులు చేసి జట్టును అదుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ ప్రత్యర్ఢి బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. తన జట్టుకు 180 పరుగులు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు.
కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఫిలిప్స్‌తో పాటు జామీసన్(20), మిచెల్(18) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్లు తైజుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. నయీం హసన్, షోర్‌ఫుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు సాధించాడు.
ఇక మూడో రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు కేవలం 32 ఓవర్ల ఆటమాత్రమే సాధ్యపడింది. ప్రస్తుతం క్రీజులో జకీర్ హసన్(16), మోమినుల్ హక్(0) ఉన్నారు.
చదవండి: LLC 2023: గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు