జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో కేప్ టౌన్ సాంప్ ఆర్మీ (ఇంగ్లండ్) ఆటగాడు డేవిడ్ మలాన్ విధ్వంసం సృష్టించాడు. నైస్ లాగోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. మలాన్‌తో పాటు రోహన్ ముస్తఫా కూడా మెరుపు అర్ద సెంచరీతో (23 బంతుల్లో 50; 10 ఫోర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సాంప్ ఆర్మీ.. నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగుల భారీ స్కోర్ చేసింది. సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ 0, మరుమణి 7, లియోనార్డో జూలియన్ 10, ఖయాస్ అహ్మద్ 8 పరుగులు చేశారు. లాగోస్ బౌలర్లలో బినుర ఫెర్నాండో, ముజరబానీ, తిసార పెరీరా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లాగోస్ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సాంప్ ఆర్మీ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. లాగోస్ ఇన్నింగ్స్‌లో తిసార పెరీరా (17 బంతుల్లో 48; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రస్సీ వాన్ డెర్ డస్సెన్ 19, అవిష్క ఫెర్నాండో 19, నజీబుల్లా జద్రాన్ 11, ర్యాన్ బర్ల్ 17*, జాషువ బిషప్ 6 పరుగులు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో అమీర్ హంజా 2, డేవిడ్ విల్లే, రోహన్ ముస్తఫా, ఖయాస్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
నిన్ననే (సెప్టెంబర్ 23) జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో జోబర్గ్ బంగ్లా టైగర్స్‌పై హరారే బోల్ట్స్.. డర్బన్ వోల్వ్స్‌పై బులవాయో జాగ్వర్స్ విజయాలు సాధించాయి.
జోబర్గ్ బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరారే బోల్ట్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ 9.4 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. 20 పరుగులు చేసిన సికందర్ రజా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బోల్ట్స్ 9.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. దసున్ షనక (21 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో బోల్ట్స్‌ను గెలిపించాడు.
డర్బన్ వోల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బులవాయో జాగ్వర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వోల్వ్స్.. విల్ స్మీడ్ (55 నాటౌట్), మార్క్ చాప్‌మన్ (38 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం లారీ ఈవాన్స్ (26), నిక్ హబ్సన్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో జాగ్వర్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
చదవండి: చరిత్ర సృష్టించిన పూరన్
Comments
Please login to add a commentAdd a comment