ICC WC 2023- Eng Vs Ned: వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా వరల్డ్‌కప్ టోర్నీలో తన తొలి శతకం నమోదు చేశాడు.
పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ డేవిడ్ మలన్ 87 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్ చెత్త షాట్ సెలక్షన్‌తో 28 పరుగులకే వెనుదిరగగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో తన పేరిటా ఓ సెంచరీని లిఖించుకున్నాడు.
మిగతా వాళ్లలో క్రిస్ వోక్స్ అర్ద శతకం(51) బాదాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. డచ్ బౌలర్లలో బాస్ డి లిడే మూడు, ఆర్యన్ దత్, లోగన్ వాన్ బీక్ చెరో రెండు, పాల్ వాన్ మెకెరన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
కాగా డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ వేదికగా ప్రపంచకప్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్‌కు కూడా సెమీ ఫైనల్ అవకాశాలు లేవు. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 9, 10 స్థానాల కోసం అన్నట్లుగా ఈ నామమాత్రపు మ్యాచ్ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన స్టోక్స్ పునరాగమనంలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, ఈ నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం సెంచరీ చేయడం విశేసం. కాగా 2019లో ఇంగ్లండ్ ట్రోఫీ గెలవడంలో స్టోక్స్‌దే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment