![IPL 2021: Punjab Kings Sign Aiden Markram As Replacement For Dawid Malan - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/12/Aiden-Markram.jpg.webp?itok=QmuSUqpA)
దుబాయి: ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ ముంగిట పంజాబ్ కింగ్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా, ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ సీజన్ నుంచి వైదొలిగాడు. అయితే, మలాన్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్కమ్‌తో పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. టీ20 వరల్డ్‌కప్ 2021, యాషెస్ సిరీస్‌కి ముందు కుటుంబంతో కలిసి గడపాలని అనుకుంటున్నా... అందుకే ఐపీఎల్ 2021 ఫేజ్ 2కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు మలాన్ తెలిపాడు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు, ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు తప్పుకోవడం గమనార్హం. మలాన్ తో పాటు క్రిస్‌వోక్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), జానీ బెయిర్‌స్టో (సన్‌రైజర్స్ హైదరాబాద్) సీజన్ నుంచి తప్పుకున్నారు.
చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు
𝘼𝙞-𝙙𝙚𝙣 vich tuhadda swaagat hai! 👋🏻
— Punjab Kings (@PunjabKingsIPL) September 11, 2021
Welcoming our newest 🦁 Aiden Markram who will replace Dawid Malan for the remainder of the season! 😍#SaddaPunjab #IPL2021 #PunjabKings pic.twitter.com/OJMW3QEwW1
Comments
Please login to add a commentAdd a comment