Virat Kohli Says It's Very Peaceful Trolls Punjab Kings After Winning - Sakshi
Sakshi News home page

Virat Kohli: తగ్గేదే లే..  గుర్తుపెట్టుకొని మరీ కౌంటర్‌ ఇచ్చాడు

Published Mon, Oct 4 2021 5:48 PM | Last Updated on Mon, Oct 4 2021 7:51 PM

Virat Kohli Says Its Very Peaceful Trolls Punjab Kings After Winning - Sakshi

Courtesy: RCB Twitter

Virat Kohli Counter To Punjab Kings.. విరాట్‌ కోహ్లి ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనను ఎవరైనా టార్గెట్‌ చేస్తే వారికి తిరిగి కౌంటర్‌ ఇచ్చేవరకు వదలడు. మరి అలాంటి కోహ్లి తన ఆర్‌సీబీ జట్టును ట్రోల్‌ చేస్తే ఊరుకుంటాడా? తగ్గేదే లే.. అన్నట్లుగా గుర్తుపెట్టుకొని మరీ పంజాబ్‌ కింగ్స్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. ఐపీఎల్‌ 2021 సీజన్‌ తొలి అంచె పోటీల్లో  ఆర్‌సీబీతో మ్యాచ్‌లో విజయం తర్వాత పంజాబ్‌ కింగ్స్‌  ఆ జట్టును ట్రోల్‌ చేస్తూ కామెంట్‌ చేసింది. ఆర్‌సీబీ డగౌట్‌ను షేర్‌ చేస్తూ.. ''మేము మ్యాచ్‌ గెలిచాం.. ఇక్కడ అంత ప్రశాంతంగానే ఉందా'' అంటూ హిందీలో ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత పంజాబ్‌ తమ ట్వీట్‌ను డిలీట్‌ చేసింది.


Courtesy: RCB Twitter

చదవండి: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా'

తాజాగా ఆదివారం ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించి ఆర్‌సీబీ ప్రతీకారం తీర్చుకుంది. ఈ సందర్భంగా ఆర్‌సీబీ డ్రెస్సింగ్‌రూమ్‌లో జరిగిన రూమ్‌ చాట్‌ను ట్విట్‌ర్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియోలో కోహ్లి.. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది.. అంటూ కామెంట్‌ చేశాడు. దీన్నిబట్టి పంజాబ్‌ కింగ్స్‌పై విజయాన్ని ఉద్దేశించే కోహ్లి అలా అన్నాడని.. గుర్తుపెట్టుకొని మరి కౌంటర్‌ ఇచ్చాడని ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు. 

ఇక ఈ సీజన్‌లోనూ సత్తా చాటిన ఆర్‌సీబీ వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. 4 ఓటములతో మూడో స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ మూడో జట్టుగా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. 

చదవండి: IPL 2021: హర్షల్‌ పటేల్‌ సూపర్‌ త్రో.. మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌; కోహ్లి గెంతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement