Photo Courtesy: IPL
ఐపీఎల్ 2021లో భాగంగా ఆర్‌సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటింగ్‌లో సునీల్ నరైన్ 26 పరుగులతో గేమ్ చేంజర్ కాగా.. గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26, నితీష్ రాణా 23 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్, హర్షల్, చహల్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో క్వాలిఫయర్ 2కు చేరుకున్న కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మరోవైపు వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ ఇంటిబాట పట్టింది. ఇక కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే చివరిదన్న సంగతి తెలిసిందే.
అంతకముందు ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్‌లో మెరవడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్, డివిలియర్స్, భరత్‌లు నిరాశపరిచారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 4, శివమ్ మావి 2 వికెట్లు తీశాడు.
నితీష్ రాణా ఔట్.. కేకేఆర్ 120/4
23 పరుగులు చేసిన నితీష్ రాణా చహల్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 120పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి ఇంకా 19 పరుగుల దూరంలో ఉంది.
వెంకటేశ్ అయ్యర్(26) రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో హర్షల్ పటేల్ 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్షల్ పటేల్ బ్రావోతో కలిసి తొలి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. నరైన్ 19, రాణా 18 పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. 7 ఓవర్లలో 53/2
139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన త్రిపాఠి చహల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు శుబ్‌మన్ గిల్(29) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ రెండో బంతిని గిల్ షాట్ ఆడే ప్రయత్నంలో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.
►139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది.
కేకేఆర్ టార్గెట్ 139
కేకేఆర్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్‌లో మెరవడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్, డివిలియర్స్, భరత్‌లు నిరాశపరిచారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 4, శివమ్ మావి 2 వికెట్లు తీశాడు.
మ్యాక్స్‌వెల్(15) రూపంలో ఆర్‌సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 17 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 113/5 గా ఉంది. షాబాజ్ 9, క్రిస్టియన్(0) క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ.. 15 ఓవర్లలో 102/4
కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో సూపర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి డివిలియర్స్(11)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అంతకముందు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి(39) కూడా నరైన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ 13, షాబాజ్ అహ్మద్ 5పరుగులతో ఆడుతున్నారు.
కేఎస్ భరత్ ఔట్.. ఆర్‌సీబీ 87/2
కేఎస్ భరత్(9) రూపంలో ఆర్‌సీబీ రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతిని భరత్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ యత్నించినప్పటికీ బౌండరీ లైన్ వద్ద ఉన్న వెంకటేశ్ అయ్యర్ క్యాచ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 87పరుగులు చేసింది. కోహ్లి 39, మ్యాక్స్‌వెల్ 9 పరుగుతో ఆడుతున్నారు.
పడిక్కల్ క్లీన్‌బౌల్డ్.. ఆర్‌సీబీ 53/1
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ వేసిన 5వ ఓవర్ తొలి బంతికి 21 పరుగులు చేసిన పడిక్కల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. కోహ్లి 24, భరత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
4 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 36/0
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. పడిక్కల్ 19, విరాట్ కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
షార్జా: ఐపీఎల్ 2021లో నేడు కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్, ఆర్‌సీబీలు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక లీగ్ మ్యాచ్‌ల్లో రెండుసార్లు తలపడగా.. ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి. ప్లేఆఫ్స్‌లో కేకేఆర్, ఆర్‌సీబీ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో 13 సార్లు ఆర్‌సీబీ నెగ్గగా.. 15 సార్లు కేకేఆర్ విజయాలు అందుకుంది.
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్
కేకేఆర్: శుబ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment