IPL 2021: Deepak Chahar Proposes To His Girl Friend During CSK Vs PBKS Game - Sakshi
Sakshi News home page

IPL 2021 CSK Vs PBKS: లైవ్‌లో లవ్‌ ప్రపోజ్‌ చేసిన చెన్నై ఆటగాడు.. అమ్మాయికి కూడా ఓకే

Published Thu, Oct 7 2021 7:51 PM | Last Updated on Fri, Oct 8 2021 7:45 AM

Deepak Chahar Proposes To His Girl Friend During CSK Vs PBKS Game - Sakshi

Deepak Chahar Proposes To His Girl Friend During Match: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ అందరూ చూస్తుండగా లైవ్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్‌ తొడిగి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ఇందుకు ఆమ్మాయి తరపు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. చాహర్‌, అతని ప్రేయసి ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు.

స్టాండ్స్‌లో ఇరువురి సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ తంతుని మొత్తం క్రీడా జగత్తు వీక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియా తెగ వైరలవుతోంది. టీమిండియా ఆటగాళ్లు సహా మొత్తం క్రికెట్‌ ప్రపంచం ఈ ప్రేమ పావురాలకు విషెస్‌ తెలిపింది. అయితే కొందరు మాత్రం చాహర్‌ చేసిన పనిని తప్పుబడుతున్నారు. మ్యాచ్‌పై కాన్సంట్రేట్‌ చేయకుండా లైవ్‌లో ఇలాంటి పని ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ చాహర్‌​, అతని ప్రేయసికి ఈ రోజు జీవితకాలం గుర్తుండిపోతుంది. కాగా, చాహర్‌ ప్రపోజ్‌ చేసిన అమ్మాయి విదేశీయురాలిగా తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement