IPL 2021: Who is Deepak Chahar Fiance Her Name Check Here- Sakshi
Sakshi News home page

Deepak Chahar: చహర్‌ ప్రేమాయణం.. భాభీ దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?!

Published Fri, Oct 8 2021 11:03 AM | Last Updated on Fri, Oct 8 2021 1:36 PM

IPL 2021: Who is Deepak Chahar Fiance Her Name Details Check Here - Sakshi

(Photo Credit: Malti Chahar, Deepak Chahar)

Deepak Chahar Girlfriend Name And Details: నచ్చిన నెచ్చెలికి మనసులోని ప్రేమను తెలియజేసి.. ఆమె వేలికి ఉంగరం తొడగటం.. ఆ వెంటనే ఆమె కూడా చిరునవ్వులతో ‘ఇష్టమే’ అని సమ్మతం తెలపడం... ‘ఇకపై నీతోనే నా జీవన పయనం’ అంటూ ఆత్మీయ ఆలింగనంలో అతడిని బంధీ చేయడం.. అక్కడిక్కడే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకోవడం.. ఓ ప్రేమికుడి జీవితంలో ఇంతకంటే మధుర క్షణాలు ఏముంటాయి!

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు దీపక్‌ చహర్‌ ప్రస్తుతం ఇలాంటి ఆనందంలో మునిగితేలుతున్నాడు. మనసిచ్చిన అమ్మాయిని మనువాడబోయే మధుర క్షణాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా.. దీపక్‌ స్టేడియంలోనే తన ప్రేయసికి ప్రేమను వ్యక్తపరచడం, ఆమె కూడా అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన వీడియోను దీపక్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. అయితే, చాలా మంది ఆ అమ్మాయిని విదేశీయురాలిగా పొరబడుతున్నారు! ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది?

విదేశీయురాలు కాదు..
దీపక్‌ చహర్‌ ప్రేమించిన అమ్మాయి పేరు జయా భరద్వాజ్‌. ఆమె ఢిల్లీకి చెందిన అమ్మాయి. మోడల్‌, వీజే, ఎమ్‌టీవీ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 2 విజేత సిద్ధార్థ్‌ భరద్వాజ్‌(34) చెల్లెలు. ఈ విషయాలను దీపక్‌ చహర్‌ సోదరి మాలతీ చహర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

మరదలు దొరికేసింది..
‘‘మొత్తానికి నా సోదరుడు చెప్పేశాడు. భాభీ దొరికేసింది. తన పేరు జయా భరద్వాజ్‌. విదేశీయురాలు కాదు.. ఢిల్లీ అమ్మాయి’’ అంటూ ఓ ఫొటోను మాలతీ షేర్‌ చేశారు. లవ్‌బర్డ్స్‌ అంటూ తమ్ముడూ, మరదలిపై ప్రేమను కురిపించారు. కాగా జయా భరద్వాజ్‌ ఢిల్లీలోని ఓ కార్పొరేట్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే... పంజాబ్‌ కింగ్స్‌ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో చహర్‌ ఒక వికెట్‌ తీశాడు.

స్కోర్లు:
చెన్నై: 134/6 (20)
పంజాబ్‌: 139/4 (13).


సోదరితో దీపక్‌ చహర్‌
చదవండి: MI Vs SRH: కేకేఆర్‌ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement