ICC Player of the Month: ICC Announced Player of the December 2021 Month Nominees - Sakshi
Sakshi News home page

ICC Player Of The Month: ఐసీసీ అవార్డు రేసులో మయాంక్‌.. పది వికెట్ల అజాజ్‌ పటేల్‌ కూడా..

Published Sat, Jan 8 2022 8:05 PM | Last Updated on Sat, Jan 8 2022 8:43 PM

December 2021: Mayank Agarwal Nominated For ICC Player Of The Month Award - Sakshi

2021 డిసెంబర్‌ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ నామినేట్‌ అయ్యాడు. అతనితో పాటు న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌, ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా అవార్డు రేసులో నిలిచారు. టీమిండియా రెగ్యులర్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన మయాంక్‌.. గత నెలలో ఆడిన రెండు టెస్ట్‌ల్లో (న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒకటి, ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్‌లో తొలి టెస్ట్‌) 69 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, రెండు అర్ధశతకాలు  ఉన్నాయి. 


ఇక ఇదే సిరీస్‌లో కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్ల సాధించి.. జిమ్‌లేకర్‌, అనిల్‌ కుంబ్లే రికార్డును సమం చేసాడు. ఆ టెస్ట్‌లో మొత్తం 14 వికెట్లను తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్‌.. మాయంక్‌తో పాటు అవార్డు రేసులో నిలిచాడు. మరోవైపు ప్రస్తుత యాషెస్‌ సిరీస్‌లో సత్తా చాటుతున్న ఆసీస్‌ ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ వీరికి పోటీగా నిలిచాడు. స్టార్క్‌ డిసెంబర్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 19.64 సగటుతో 14 వికెట్లు తీశాడు. 
చదవండి: పాక్‌ మాజీ కెప్టెన్‌ ఫిక్సింగ్‌ చేయమన్నాడు.. షేన్‌ వార్న్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement