
2023 మే నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (జూన్ 6) ప్రకటించింది. గడిచిన నెలలో వన్డేల్లో ప్రదర్శన ఆధారంగా నామినీస్ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. పురుషులతో పాటు మహిళల క్రికెట్ నుంచి చెరో ముగ్గురి పేర్లను ఐసీసీ వెల్లడించింది.
పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ షాంటో, ఐర్లాండ్ ప్లేయర్ హ్యారీ టెక్టార్ రేసులో ఉండగా.. మహిళల కేటగిరి నుంచి శ్రీలంక ప్లేయర్స్ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్‌లాండ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్ నామినీస్‌గా ఉన్నారు. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓట్లు వేసి విజేతలను నిర్ణయిస్తారు. వచ్చే వారం విజేతలను ఐసీసీ ప్రకటిస్తుంది.
మే నెలలో నామినీస్ ప్రదర్శనలు..
- బాబర్ ఆజమ్: న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 3, 4, 5 వన్డేల్లో 54, 107, 117 పరుగులు
- నజ్ముల్ షాంటో: ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో 44, 117, 35 పరుగులు
- హ్యారీ టెక్టార్: బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 21, 140, 45 పరుగులు
చదవండి: WTC Final: అతను సెంచరీ కొట్టాడా టీమిండియా గెలిచినట్లే..!
Comments
Please login to add a commentAdd a comment