అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2023 అవార్డుల నామినీస్ జాబితాలను పలు దఫాలుగా ప్రకటిస్తూ వస్తుంది. తొలుత పురుషులు, మహిళలకు సంబంధించిన టీ20, ఎమిర్జింగ్ ప్లేయర్స్ నామినీస్ జాబితాను ప్రకటించిన ఐసీసీ.. ఆతర్వాత వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినీస్ జాబితాను విడుదల చేసింది. తాజాగా ఐసీసీ.. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ జాబితాను ప్రకటించింది.
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ జాబితాలో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు ( విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా), ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు (పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్) ఉండగా.. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ జాబితాలో ఇద్దరు ఆస్ట్రేలియన్లు (ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా), ఓ టీమిండియన్ (రవిచంద్రన్ అశ్విన్), ఓ ఇంగ్లండ్ ఆటగాడు (జో రూట్) ఉన్నారు. 2023 ఐసీసీ అవార్డులలో విరాట్ కోహ్లి టెస్ట్ ఫార్మాట్ మినహా అన్ని విభాగాల్లో పోటీపడుతుండటం విశేషం.
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023:
- విరాట్ కోహ్లి (భారత్)
- పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)
- రవీంద్ర జడేజా (భారత్)
- ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా)
మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023:
- రవిచంద్రన్ అశ్విన్ (భారత్)
- ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా)
- ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా)
- జో రూట్ (ఇంగ్లండ్)
మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023:
- శుభ్‌మన్ గిల్ (భారత్)
- మొహమ్మద్ షమీ (భారత్)
- విరాట్ కోహ్లి (భారత్)
- డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)
వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023:
- ఆష్లే గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా)
- చమారీ ఆటపట్టు (శ్రీలంక)
- నాట్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్)
- అమేలియా కెర్ (న్యూజిలాండ్)
మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023:
- సూర్యకుమార్ యాదవ్ (భారత్)
- సికందర్ రజా (జింబాబ్వే)
- మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్)
- అల్పేశ్ రామ్‌జనీ (ఉగాండ)
వుమెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023:
- చమారీ ఆటపట్టు (శ్రీలంక)
- సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్)
- హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్)
- ఎల్లైస్ పెర్రీ (ఆస్ట్రేలియా)
మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023:
- యశస్వి జైస్వాల్ (భారత్)
- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
- గెరాల్డ్ కొయెట్జీ (సౌతాఫ్రికా)
- దిల్షన్ మధుషంక (శ్రీలంక)
వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023:
- మరూఫా అక్తర్ (బంగ్లాదేశ్)
- లారెన్ బెల్ (ఇంగ్లండ్)
- డార్సీ కార్టర్ (స్కాట్లాండ్)
- ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా)
Comments
Please login to add a commentAdd a comment