పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్ ప్రతిష్టాత్మక ఐసీసీ పురస్కారానికి ఎంపికయ్యాడు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు రేసులో బాబర్‌కు పోటీగా షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), జన్నెమాన్ మలాన్(దక్షిణాఫ్రికా), పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్) ఉన్నప్పటికీ పాక్ కెప్టెన్‌నే అవార్డు వరించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ప్రకటన ద్వారా తెలిపింది.
PCB congratulates @babarazam258 on winning ICC Men's ODI Cricketer of the Year 2021 pic.twitter.com/BLqblHbJiq
— Pakistan Cricket (@TheRealPCB) January 24, 2022
ఈ అవార్డుతో పాటు పాక్ కెప్టెన్ ఖాతాలో మరో రెండు అవార్డులు చేరాయి. వన్డే కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ 2021, టీ20 కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డులను సైతం బాబరే సొంతం చేసుకున్నాడు. గతేడాది మొత్తం 6 వన్డేలు ఆడిన బాబర్.. 67.50 సగటున 405 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. కాగా, గతేడాది టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా పాక్‌కే దక్కింది. ఆ దేశ వికెట్‌కీపర్, స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.
🏅 Marais Erasmus, a member of the Elite Panel of ICC Umpires, is the 2021 ICC Umpire of the Year 👏
— ICC (@ICC) January 24, 2022
All the announced awards so far 👉 https://t.co/2SczDfXxGP pic.twitter.com/zaC0BSyMXf
మొత్తంగా చూస్తే గతేడాదికి సంబంధించి పాకిస్థాన్‌కు అవార్డుల పంట పండింది. రిజ్వాన్ అవార్డు కలుపుకుంటే వారి ఖాతాలో మొత్తం నాలుగు అవార్డులు చేరాయి. మరోవైపు, భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌లో అంపైర్‌గా వ్యవహరించిన మరియాస్ ఎరాస్మస్ అంపైర్ అఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. అతను 2016, 2017 సంవత్సరాల్లో కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు.
చదవండి: టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరంటే..!
Comments
Please login to add a commentAdd a comment