ODI Cricketer of the Year Award
-
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు గెలుచుకుంది. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ మంధనను ఈ అవార్డు వరించింది.గతేడాది మొత్తం 13 వన్డేలు ఆడిన మంధన, నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్‌గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై తలో సెంచరీ చేసింది.ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. అయితే చివరికి ఈ అవార్డు మంధననే వరించింది. ఈ అవార్డు సాధించడానికి ముందు మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్, ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్‌లలో చోటు దక్కించుకుంది. వన్డే టీమ్‌కు మంధనతో పాటు భారత్ నుంచి దీప్తి శర్మ ఎంపిక కాగా.. టీ20 టీమ్‌లో మంధన, దీప్తి శర్మతో పాటు భారత్ నుంచి రిచా ఘోష్ కూడా చోటు దక్కించుకుంది.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్.వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- స్మృతి మంధన ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ -
వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు గెలుచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ప్రతిష్టాత్మక ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ ఒమర్జాయ్ను ఈ అవార్డు వరించింది. ఒమర్జాయ్ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. ఒమర్జాయ్ బ్యాటింగ్ సగటు గతేడాది 52.12గా ఉంది. ఒమర్జాయ్ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్‌ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. శ్రీలంక మినహా ఐర్లాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై విజయాలు సాధించింది. ఒమర్జాయ్ గతేడాది ఆఫ్ఘనిస్తాన్ తరఫున సెకండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా, సెకెండ్ హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 24 ఏళ్ల ఒమర్జాయ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌తో పాటు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. ఒమర్జాయ్ 2024లో తన తొలి వన్డేలోనే సూపర్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను అజేయమైన 149 పరుగులు చేశాడు. ఒమర్జాయ్ గతేడాది సౌతాఫ్రికాపై ఓ అద్భుత ప్రదర్శన చేశాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోని రెండో వన్డేలో ఒమర్జాయ్ 50 బంతుల్లో అజేయమైన 86 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఒమర్జాయ్ బంతితోనూ చెలరేగాడు. 2021లో వన్డే అరంగ్రేటం చేసిన ఒమర్జాయ్ ఇప్పటివరకు 36 వన్డేలు ఆడి 907 పరుగులు చేశాడు. అలాగే 30 వికెట్లు పడగొట్టాడు. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ఒమర్జాయ్తో పాటు కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగ పోటీ పడ్డారు.2024కు సంబంధించి ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు- ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ - ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్- ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్- ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝా- ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్- ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్- ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్- ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
24 ఏళ్లలో తొలిసారి.. 35 ఏళ్లలో నాలుగోసారి.. అది రా కోహ్లి అంటే..!
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. కింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నాటి నుంచి తన బ్యాటింగ్ మెళకువలతో పట్ట పగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. మధ్యలో రెండేళ్లు తప్పించి.. ఇంటా బయటా, ఈ దేశం ఆ దేశం, స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా అన్ని దేశాలపై, తన సమకాలీకులైన అందరూ బౌలర్లపై కోహ్లి పైచేయి సాధించాడు. వయసు పైబడే కొద్ది అతను పాతబడ్డ వైన్‌లా ఇంకా మత్తుగా తయారవుతున్నాడు. కింగ్ ఇటీవలి ఫామే అందకు నిదర్శనం. గతేడాది ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో కెరీర్ అత్యుత్తమ ఫామ్‌ను కనబర్చిన కోహ్లి.. ఆ టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవడమే కాకుండా, ఆ ప్రదర్శన కారణంగా గతేడాది ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లి అత్యంత ప్రతిష్టాత్మకమైన వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలవడం ఇది తొలిసారి కాదు. కింగ్ 2012లోనే 24 ఏళ్ల వయసులో తొలిసారి ఈ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లి స్టామినా ఏ స్థాయిలో ఉందంటే.. అతను మళ్లీ 35 ఏళ్ల వయసులోనూ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 11 ఏళ్ల తర్వాత ఏ క్రీడలో అయినా క్రీడాకారుల శోభ కాస్త తగ్గుతుంది. అయితే కోహ్లి అలా కాదు, వయసు పెరిగే కొద్ది ఇంకా రాటుదేలుతున్నాడు. పాతబడ్డ వైన్‌లా ఇంకా మత్తెక్కిస్తున్నాడు. కోహ్లి తన కెరీర్లో ఇది సాధించలేదు అనడానికి లేకుండా దాదాపుగా అన్ని సాధించేశాడు. వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో (2011) సభ్యుడిగా, వన్డే వరల్డ్‌కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా, 50 వన్డే శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా.. ఓ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ 2010-2020గా (దశాబ్దం), నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు (2012, 2017, 2018, 2023) గెలిచిన ఏకైక ఆటగాడిగా, అత్యధిక ఐసీసీ (4) అవార్డులు సాధించిన ఆటగాడిగా దాదాపు అన్ని రికార్డులను కవర్ చేశాడు. కోహ్లి.. ప్రస్తుతం సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డుపై కన్నేశాడు. ఈ ఒక్కటీ పూర్తి చేస్తే క్రికెటర్‌గా కోహ్లి జన్మ సంపూర్ణమైపోతుంది. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్, అతని ఫిట్నెస్ స్థాయిలను బట్టి ఇది పెద్ద విషయమేమీ కాదు. త్వరలో కోహ్లి.. సచిన్ రికార్డును అధిగమిస్తాడని ఆశిద్దాం. ఇదిలా ఉంటే, కోహ్లి వ్యక్తిగత కారణాల చేత ప్రస్తుతం ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. -
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు రేసులో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీస్ జాబితాను ఇవాళ (జనవరి 4) ప్రకటించింది. అవార్డు రేసులో ఏకంగా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీతో పాటు గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం పోటీపడనున్నారు. వీరితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ రేసులో నిలిచాడు. మిచెల్ సైతం గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించడంతో పాటు వరల్డ్‌కప్ 2023లోనూ చెలరేగిపోయాడు. కాగా, ఐసీసీ నిన్న మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) అవార్డుల కోసం నామినీస్ జాబితాను ప్రకటించింది. టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌తో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో టీమిండియా అప్‌కమింగ్ స్టార్ యశస్వి జైస్వాల్‌తో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ఆయా విభాగాల్లో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ నామినీస్ జాబితాను ఎంపిక చేసింది. -
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బాబర్ ఆజం
2022 ఏడాదికి గానూ ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిలిచాడు. గతేడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు చేసిన బాబర్ ఖాతాలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్ ఆజం వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం బాబర్ ఆజం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో(బ్యాటింగ్ విభాగం) నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇక 2022 ఐసీసీ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచిన విషయం విధితమే. ఇక వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 రేసులో నిలిచిన ఆడమ్ జంపా, సికిందర్ రజా, వెస్టిండీస్ ఓపెనర్ షెయ్ హోప్‌ల కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకొని బాబర్ ఆజం తొలి స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా రెండో ఏడాది వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుడు సొంతం చేసుకున్న ఆటగాడిగా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు. దీంతో పాటు బాబర్ ఆజం 2022 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులోనూ ఉన్నాడు. ఈ అవార్డుకు బాబర్ ఆజంతో పాటు ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు పోటీ పడుతున్నారు ఇంగ్లండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వార్త్.. ఐసీసీ 2022 అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అంపైర్‌కు అవార్డు రావడం ఇది రెండోసారి. గతంలో 2019లోనూ ఇల్లింగ్‌వార్త్ విజేతగా నిలిచాడు.సౌతాఫ్రికా యంగ్ ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు కైవసం చేసుకున్నాడు. గతేడాది 36 టెస్టు వికెట్లు తీసిన మార్కో జాన్సెన్.. వన్డేల్లో రెండు, టి20ల్లో ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 234 పరుగులు సాధించాడు. Babar Azam is the ICC Men's ODI Cricketer of the Year for the second year in a row ✨#ICCAwards pic.twitter.com/JcTIEtwwPe — Pakistan Cricket (@TheRealPCB) January 26, 2023 చదవండి: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై Hulk Hogan: అసభ్యకర ట్వీట్ చేసిన రెజ్లింగ్ స్టార్.. ఆపై తొలగింపు 'సూర్య లేకుంటే మూడు ఫార్మాట్లు లేనట్లే' -
ICC Awards 2021: వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే..!
పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్ ప్రతిష్టాత్మక ఐసీసీ పురస్కారానికి ఎంపికయ్యాడు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు రేసులో బాబర్‌కు పోటీగా షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), జన్నెమాన్ మలాన్(దక్షిణాఫ్రికా), పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్) ఉన్నప్పటికీ పాక్ కెప్టెన్‌నే అవార్డు వరించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ప్రకటన ద్వారా తెలిపింది. PCB congratulates @babarazam258 on winning ICC Men's ODI Cricketer of the Year 2021 pic.twitter.com/BLqblHbJiq — Pakistan Cricket (@TheRealPCB) January 24, 2022 ఈ అవార్డుతో పాటు పాక్ కెప్టెన్ ఖాతాలో మరో రెండు అవార్డులు చేరాయి. వన్డే కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ 2021, టీ20 కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డులను సైతం బాబరే సొంతం చేసుకున్నాడు. గతేడాది మొత్తం 6 వన్డేలు ఆడిన బాబర్.. 67.50 సగటున 405 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. కాగా, గతేడాది టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా పాక్‌కే దక్కింది. ఆ దేశ వికెట్‌కీపర్, స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. 🏅 Marais Erasmus, a member of the Elite Panel of ICC Umpires, is the 2021 ICC Umpire of the Year 👏 All the announced awards so far 👉 https://t.co/2SczDfXxGP pic.twitter.com/zaC0BSyMXf — ICC (@ICC) January 24, 2022 మొత్తంగా చూస్తే గతేడాదికి సంబంధించి పాకిస్థాన్‌కు అవార్డుల పంట పండింది. రిజ్వాన్ అవార్డు కలుపుకుంటే వారి ఖాతాలో మొత్తం నాలుగు అవార్డులు చేరాయి. మరోవైపు, భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌లో అంపైర్‌గా వ్యవహరించిన మరియాస్ ఎరాస్మస్ అంపైర్ అఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. అతను 2016, 2017 సంవత్సరాల్లో కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరంటే..! -
ఆశ్చర్యమేమీ లేదు: సచిన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన వార్షిక అవార్డుల్లో అత్యధిక అవార్డులను గెలుచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో దూసుకుపోతున్న కోహ్లి పలు ఐసీసీ ప్రధాన అవార్డులను గెలుచుకోవడంలో ఆశ్చర్యపోవాల్సి ఏమీ లేదంటూ సచిన్ కొనియాడాడు. ఆ అవార్డులను గెలుచుకోవడానికి విరాట్ అన్ని విధాల అర్హుడన్నాడు. ఈ మేరకు గురువారం ఐసీసీ అవార్డుల ప్రకటించిన తరువాత సచిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోహ్లికి అభినందలు తెలియజేశాడు. ' ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నీకు అర్హత ఉంది కాబట్టే సదరు అవార్డును గెలుచుకున్నావ్. నీకు అనేకమైన అభినందనలు' అని సచిన్ ట్వీట్ చేశాడు. 2017 సంవత్సరానికి గాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లి దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా కూడా కోహ్లి ఎంపికయ్యాడు. మరొకవైపు విశేషమైన టాలెంట్ ఉన్న క్రికెటర్ల గౌరవ సూచకంగా ఇచ్చే ఐసీసీ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని సైతం కోహ్లి గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. -
కోహ్లికి ఐసీసీ అవార్డుల పంట..!
-
ఎనిమిదేళ్ల తర్వాత కోహ్లి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. 2017 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన తాజా అవార్డుల జాబితాలో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డులను గెలుచుకున్న కోహ్లి.. అదే ఏడాదికి ఐసీసీ టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. తద్వారా ఎనిమిదేళ్ల తర్వాత ఒకే ఏడాదిలో ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఎంపికైన తొలి భారత క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 2009లో ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు ధోని కెప్టెన్‌గా ఎంపికవ్వగా, తాజాగా ఆ ఘనతను కోహ్లి సాధించాడు. ఓవరాల్‌గా చూస్తే ఒకే ఏడాదిలో రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికైన మూడో ఆటగాడిగా కోహ్లి గుర్తింపు పొందాడు. 2004,2007ల్లో రికీ పాంటింగ్(ఆసీస్) ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు ఎంపికవ్వగా, ఆపై భారత్ నుంచి ధోని, కోహ్లిలు మాత్రమే ఆ ఘనతను సాధించారు. -
కోహ్లికి అవార్డుల పంట..!
దుబాయ్: గతేడాదికి గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన అవార్డుల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పలు అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భీకరమైన ఫామ్‌తో చెలరేగిపోతూ పరుగుల మెషీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లి.. 2017 సంవత్సరానికి గాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను దక్కించుకున్నాడు. దాంతో పాటు ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా కూడా కోహ్లి ఎంపికయ్యాడు. మరొకవైపు విశేషమైన టాలెంట్ ఉన్న క్రికెటర్ల గౌరవ సూచకంగా ఇచ్చే ఐసీసీ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని సైతం కోహ్లి గెలుచుకున్నాడు. ఈ మేరకు గురువారం ఐసీసీ విడుదుల చేసిన అవార్డులను కోహ్లి స్వీప్ చేశాడంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. ఇక ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ గెలుచుకోగా, ఐసీసీ టీ20 ఫెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డును టీమిండియా యువ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ దక్కించుకున్నాడు. ఎమర్జెంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ గెలుచుకున్నాడు. ఐసీసీ ఫ్యాన్స్ మూమెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును చాంపియన్స్ ట్రోఫీ సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు దక్కించుకుంది. -
ఐసీసీ అవార్డు రేసులో కోహ్లి
దుబాయ్: భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లి రెండోసారి 'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రేసులో నిలిచాడు. టీమిండియా తరపున అతడొక్కడే ఈ అవార్డు రేసులో ఉన్నాడు. 2012లో తొలిసారి అతడీ అవార్డు దక్కించుకున్నాడు. 2014 ఎల్జీ ఐసీసీ అవార్డులకు నామినేటయిన క్రికెటర్ల పేర్లు బుధవారం వెల్లడయ్యాయి. 'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు విరాట్ కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీకాక్, డీవిలియర్స్, స్టెయిన్ పోటీలో ఉన్నారు. డీవిలియర్స్ కూడా రెండోసారి ఈ అవార్డుకు పోటీ పడుతున్నాడు. 2010లో అతడీ అవార్డు అందుకున్నాడు. విజేతల పేర్లను నవంబర్ 14న ప్రకటిస్తారు. తర్వాత రోజు ప్రత్యేక టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.