ఐసీసీ అవార్డు రేసులో కోహ్లి | Virat Kohli nominated for ICC ODI Cricketer of the Year Award | Sakshi
Sakshi News home page

ఐసీసీ అవార్డు రేసులో కోహ్లి

Published Wed, Nov 5 2014 2:16 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

ఐసీసీ అవార్డు రేసులో కోహ్లి

ఐసీసీ అవార్డు రేసులో కోహ్లి

దుబాయ్: భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లి రెండోసారి 'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రేసులో నిలిచాడు. టీమిండియా తరపున అతడొక్కడే ఈ అవార్డు రేసులో ఉన్నాడు. 2012లో తొలిసారి అతడీ అవార్డు దక్కించుకున్నాడు. 2014 ఎల్జీ ఐసీసీ అవార్డులకు నామినేటయిన క్రికెటర్ల పేర్లు బుధవారం వెల్లడయ్యాయి.

'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు విరాట్ కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీకాక్, డీవిలియర్స్, స్టెయిన్ పోటీలో ఉన్నారు. డీవిలియర్స్ కూడా రెండోసారి ఈ అవార్డుకు పోటీ పడుతున్నాడు. 2010లో అతడీ అవార్డు అందుకున్నాడు. విజేతల పేర్లను
నవంబర్ 14న ప్రకటిస్తారు. తర్వాత రోజు ప్రత్యేక టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement