
దుబాయ్: గతేడాదికి గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన అవార్డుల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పలు అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భీకరమైన ఫామ్‌తో చెలరేగిపోతూ పరుగుల మెషీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లి.. 2017 సంవత్సరానికి గాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను దక్కించుకున్నాడు. దాంతో పాటు ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా కూడా కోహ్లి ఎంపికయ్యాడు. మరొకవైపు విశేషమైన టాలెంట్ ఉన్న క్రికెటర్ల గౌరవ సూచకంగా ఇచ్చే ఐసీసీ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని సైతం కోహ్లి గెలుచుకున్నాడు. ఈ మేరకు గురువారం ఐసీసీ విడుదుల చేసిన అవార్డులను కోహ్లి స్వీప్ చేశాడంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొంది.
ఇక ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ గెలుచుకోగా, ఐసీసీ టీ20 ఫెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డును టీమిండియా యువ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ దక్కించుకున్నాడు. ఎమర్జెంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ గెలుచుకున్నాడు. ఐసీసీ ఫ్యాన్స్ మూమెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును చాంపియన్స్ ట్రోఫీ సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment