పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫామ్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాదిలో విరాట్ కోహ్లికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక తన రిథమ్‌ను తిరిగి పొందిన విరాట్.. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టుకు సన్నద్దమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌లు కోహ్లిని చూసి నేర్చుకోవాలని పాంటింగ్ సూచించాడు. కాగా ఈ ఆసీస్ స్టార్లు ఇద్దరూ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నారు. పెర్త్ టెస్టులో వీరిద్దరి దారుణ ప్రదర్శన చేశారు.
ఈ క్రమంలో పాంటింగ్ ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. "విరాట్ ఎప్పుడూ ఆత్మవిశ్వాన్ని కోల్పోడు. అతడొక వారియర్. తనను తను విశ్వసించినందున బలంగా తిరిగి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కంటే రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి డిఫెరెంట్‌గా కన్పించాడు.
అతడు ప్రత్యర్ధిలతో పోరాడాలని భావించలేదు. కేవలం తన బలాలపై దృష్టి పెట్టాడు. లబుషేన్, స్మిత్ కూడా కోహ్లిని ఫాలో అవ్వాలి. పరుగులు ఎలా చేయాలో ముందు దృష్టి పెట్టిండి. అంతే తప్ప మీ వికెట్ గురించి ఆలోచించకండి.
ఫామ్‌లో లేనప్పుడు ఏ ఆటగాడికైనా పరుగులు సాధించడం చాలా కష్టమవుతోంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. అందకు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయడమే ఒక్కటే మార్గమని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment