ఐసీసీ అవార్డు రేసులో కోహ్లి
దుబాయ్: భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లి రెండోసారి 'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రేసులో నిలిచాడు. టీమిండియా తరపున అతడొక్కడే ఈ అవార్డు రేసులో ఉన్నాడు. 2012లో తొలిసారి అతడీ అవార్డు దక్కించుకున్నాడు. 2014 ఎల్జీ ఐసీసీ అవార్డులకు నామినేటయిన క్రికెటర్ల పేర్లు బుధవారం వెల్లడయ్యాయి.
'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు విరాట్ కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీకాక్, డీవిలియర్స్, స్టెయిన్ పోటీలో ఉన్నారు. డీవిలియర్స్ కూడా రెండోసారి ఈ అవార్డుకు పోటీ పడుతున్నాడు. 2010లో అతడీ అవార్డు అందుకున్నాడు. విజేతల పేర్లను
నవంబర్ 14న ప్రకటిస్తారు. తర్వాత రోజు ప్రత్యేక టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.