టీమిండియా ప్లేయర్లకు నిరాశ
దుబాయ్: ఐసీసీ వార్షిక అవార్డుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మెరిశారు. టీమిండియా ప్లేయర్లకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాప్ లో నిలిచాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.
2015 సంవత్సరానికి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన స్మిత్ ప్రతిష్టాత్మక సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ పురస్కారం అందుకోనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్. అంతకుముందు రికీ పాంటింగ్, మిచెల్ జాన్సన్, మైఖేల్ క్లార్క్ ఈ పురస్కారం అందుకున్నారు. దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైయ్యాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ ద్వారా అవార్డులు ప్రకటించారు.
ఇతర పురస్కారాలు
టి20 పెర్ ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్: డూ ప్లెసిస్(దక్షిణాఫ్రికా)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: జోష్ హాజిల్ వుడ్(ఆస్టేలియా)
స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డ్: బ్రెండన్ మెక్ కల్లమ్(న్యూజిలాండ్)
అంపైర్ ఆఫ్ ది ఇయర్: రిచర్డ్ కెటెల్ బారో
వుమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: మెగ్ లానింగ్(ఆస్ట్రేలియా కెప్టెన్)
వుమెన్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: స్టాఫానీ టేలర్(వెస్టిండీస్ కెప్టెన్)