Ireland Harry Tector Named ICC Men's Player Of The Month For May - Sakshi
Sakshi News home page

ICC Player Of The Month May: ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అనామక ప్లేయర్‌

Published Mon, Jun 12 2023 6:31 PM | Last Updated on Mon, Jun 12 2023 6:48 PM

Ireland Harry Tector Named ICC Mens Player Of The Month For May - Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు షాక్‌ తగిలింది. బాబర్‌ను కాదని ఓ అనామక జట్టు ప్లేయర్‌ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలుచుకున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన హ్యారీ టెక్టార్‌ 2023 మే నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా ఎంపికయ్యాడు. మే నెలలో టెక్టార్‌తో పోలిస్తే బాబర్‌ ప్రదర్శనలే మెరుగ్గా ఉన్నప్పటికీ, అవార్డు టెక్టార్‌నే వరించింది.

టెక్టార్‌, బాబర్‌తో పాటు బంగ్లాదేశ్‌ ఆటగాడు నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో ఉండగా.. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు టెక్టార్‌కే అధిక ఓట్లు వేసి గెలిపించారు. పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుతో పాటు మహిళల విభాగంలోనూ ఈ అవార్డు విజేతను ప్రకటించారు.

అవార్డు రేసులో శ్రీలంక ప్లేయర్స్‌ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్‌లాండ్‌ క్రికెటర్‌ థిపోట్చా పుత్తవాంగ్‌ ఉండగా.. 19 ఏళ్ల థాయ్‌ క్రికెటర్‌ థిపోట్చా పుత్తవాంగ్‌ను ఈ అవార్డు వరించింది. కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. 

మే నెలలో నామినీస్‌ ప్రదర్శనలు..

  • బాబర్‌ ఆజమ్‌: న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 3, 4, 5 వన్డేల్లో 54, 107, 117 పరుగులు
  • నజ్ముల్‌ షాంటో: ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో 44, 117, 35 పరుగులు
  • హ్యారీ టెక్టార్‌: బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 21, 140, 45 పరుగులు

చదవండి: WTC Final 2023: ఆల్‌ ఫార్మాట్‌ సూపర్‌ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement