ICC Awards 2021: Check Here Complete List of Winners - Sakshi
Sakshi News home page

2021 అవార్డులను ప్రకటించిన ఐసీసీ.. జాబితాలో పాక్‌ ప్లేయర్ల హవా

Published Mon, Jan 24 2022 5:57 PM | Last Updated on Mon, Jan 24 2022 6:24 PM

Winners List Of 2021 ICC Awards - Sakshi

గతేడాది అన్ని ఫార్మాట్లలో అదరగొట్టిన  పాక్‌ క్రికెటర్లు ఐసీసీ అవార్డులను కొల్లగొట్టారు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల వన్డే(బాబర్‌ ఆజమ్‌), టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌(మహ్మద్‌ రిజ్వాన్‌), క్రికెటర్ ఆఫ్ ద ఇయర్(షాహీన్ అఫ్రిది) అవార్డులతో పాటు ఎమర్జింగ్ ఉమెన్స్‌ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును(ఫాతిమా సనా) సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఐసీసీ ప్రకటించిన వన్డే, టీ20 జట్లకు సైతం పాక్‌ ఆటగాడే(బాబర్‌ ఆజమ్‌) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ రెండు జట్లలో ఒక్క భారత ఆటగాడికి కూడా ప్రాతినిధ్యం లభించకపోవడం విశేషం.


అయితే, ఐసీసీ టెస్ట్‌ జట్టులో మాత్రం ముగ్గురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్టు జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే, పురుషులు, మహిళల విభాగాల్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఐసీసీ అవార్డులకు ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత్‌ నుంచి మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది. మూడు ఫార్మాట్లలో రాణించినందుకు గాను ఆమెకు.. ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డు లభించింది. 

2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన అవార్డుల జాబితా : 

- ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జో రూట్ (ఇంగ్లాండ్) 
- ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) 
- ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) 
- ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - షాహీన్ అఫ్రిది  (పాకిస్థాన్) 
- ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జన్నేమన్ మలాన్ (సౌతాఫ్రికా) 
- ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జీషన్ మసూద్ (ఒమన్) 
- ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఈయర్ -  మారియస్ ఎరాస్మస్ 

- ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - స్మృతి మంధాన (ఇండియా) 
- ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - టామీ బ్యూమోంట్ (ఇంగ్లాండ్) 
- ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - ఫాతిమా సనా (పాకిస్థాన్)
- ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్  క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - ఆండ్రియా (ఆస్ట్రియా) 

 (ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్, ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు ఇంకా ప్రకటించాల్సి ఉంది) 
చదవండి: ఓ ప్రముఖ​ భారత వ్యాపారవేత్త మ్యాచ్‌ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement