T20 World Cup: David Warner Won Player of The Month November 2021 - Sakshi
Sakshi News home page

ICC Player Of The Month For November 2021: ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా డేవిడ్ వార్నర్

Published Mon, Dec 13 2021 6:06 PM | Last Updated on Mon, Dec 13 2021 9:33 PM

David Warner Won The ICC Player Of The Month Award For November 2021 - Sakshi

దుబాయ్: ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ నవంబరు నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. నవంబర్‌ నెలలో జరిగిన టీ20 ప్రపంచకప్‌-2021లో అద్భుత ప్రదర్శనకు గాను అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. వార్నర్‌.. పాకిస్థాన్ ఓపెనర్ ఆబిద్ అలీ, న్యూజిలాండ్ సీమర్ టిమ్ సౌథీలను వెనక్కినెట్టి ఈ అవార్డును కైవసం చేసుకున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది. 

కాగా, వార్నర్‌ పొట్టి ప్రపంచకప్‌-2021లో రెండు హాఫ్‌ సెంచరీలతో చెలరేగిపోవడంతో ఆసీస్‌ తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మెగా టోర్నీలో అతను ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు.     

మరోవైపు, నవంబర్‌ నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మ్యాథ్యూస్ ఎంపికైంది. గత నెలలో జరిగిన వన్డేల్లో మాథ్యూస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన(4 మ్యాచ్‌ల్లో 141 పరుగులు, 9 వికెట్లు)తో అదరగొట్టడంతో ఆమెను ఈ అవార్డు వరించింది. మాథ్యూస్.. ఈ అవార్డుకు ఎంపికయ్యే క్రమంలో పాక్‌ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆనం అమిన్, బంగ్లాదేశ్‌కు చెందిన నహీదా అక్తర్‌లను వెనక్కి నెట్టింది.
చదవండి: మూడు రోజుల క్వారంటైన్‌లో టీమిండియా.. డుమ్మా కొట్టిన కోహ్లి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement