ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా భువీ.. | Bhuvneshwar Kumar And Lizelle Lee Voted ICC Players For The Month Of March 2021 | Sakshi
Sakshi News home page

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా భువీ..

Published Tue, Apr 13 2021 6:17 PM | Last Updated on Wed, Apr 14 2021 2:54 AM

Bhuvneshwar Kumar And Lizelle Lee Voted ICC Players For The Month Of March 2021 - Sakshi

దుబాయ్‌: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఎంపికైనట్లు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం భువీతో పాటు జింబాబ్వే ప్లేయర్‌ సీన్‌ విలియమ్స్‌, అఫ్గనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌లు పోటీపడగా చివరికు ఈ అవార్డు భువీనే వరించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అతను 6.38 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో భువీ ఏకంగా 17 డాట్ బాల్స్‌ వేయడం విశేషం. 

ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడో నెల కూడా టీమిండియా ఆటగాడినే  ఈ అవార్డు వరించడం మరో విశేషం. జనవరి నెలకు వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, ఫిబ్రవరి నెలకు ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే మహిళల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా దక్షిణాఫ్రికా బ్యాటర్‌ ​లిజెల్‌ లీ ఎంపికయ్యారు. ఈ విభాగంలో లిజెల్‌ లీతో పాటు రేసులో ఇద్దరు భారత అమ్మాయిలు(రాజేశ్వరీ గైక్వాడ్‌, పూనమ్‌ రౌత్‌) ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లిజెల్‌ వైపే ఐసీసీ మొగ్గు చూపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement