
India Vs Sl 2nd Pink Ball Test: టీమిండియాతో రెండో టెస్టుకు ముందు శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరు వేదికగా జరుగనున్న పింక్‌బాల్ టెస్టుకు ఆ జట్టు ఆటగాడు పథుమ్ నిసాంక దూరం కానున్నట్లు సమాచారం. గాయంతో బాధపడుతున్న అతడు రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
కాగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా టీమిండియాతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో రోహిత్ సేన చేతిలో ఓటమి చెందింది. ఇక మ్యాచ్‌లో శ్రీలంక తరఫున నిసాంక తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తంగా 67 పరుగులు చేశాడు. లంక బ్యాటర్లలో ఇతడి స్కోరే అధికం.
ఇక 23 ఏళ్ల నిసాంకకు వెన్నునొప్పి తిరగబెట్టినందున అతడు రెండో టెస్టు ఆడే అవకాశం లేదని శ్రీలంక క్రికెట్ అధికారి పేర్కొనడంతో లంక అభిమానులు ఉసూరుమంటున్నారు. అతడి స్థానంలో దినేశ్ చండిమాల్ లేదంటే.. కుశాల్ మెండిస్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..!
Comments
Please login to add a commentAdd a comment