సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయపరంపరకు కళ్లెం పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో రోహిత్ సేన 113 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఫలితంగా గత 18 టెస్టు సిరీస్‌లలో టీమిండియా సాగించిన జైత్రయాత్రకు బ్రేక్ పడింది.
కివీస్ సరికొత్త చరిత్ర
అంతేకాదు.. పుణె టెస్టు ఓటమితో రోహిత్ సేన ఖాతాలో మరో చెత్త రికార్డు కూడా నమోదైంది. స్వదేశంలో కివీస్ జట్టు చేతిలో భారత్‌కు ఇదే తొలి పరాజయం. పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కూడా!.. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ భారత్‌లో మొట్టమొదటి సిరీస్ గెలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా కివీస్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేనపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన కివీస్.. తాజాగా పుణె టెస్టులో 113 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పదమూడు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు విశేషాలు
భారత్‌లో పర్యాటక జట్ల టెస్టు సిరీస్ విజయాలు
👉ఇంగ్లండ్- ఐదుసార్లు
👉వెస్టిండీస్- ఐదుసార్లు
👉ఆస్ట్రేలియా- నాలుగుసార్లు
👉పాకిస్తాన్- ఒకసారి(1986/87)
👉సౌతాఫ్రికా- ఒకసారి(1999/00)
👉న్యూజిలాండ్- ఒకసారి(2024/25)
ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా ఓడిన అత్యధిక మ్యాచ్‌లు
👉1969- నాలుగు(ఆస్ట్రేలియా చేతిలో మూడు, న్యూజిలాండ్ చేతిలో ఒకటి)
👉1983- మూడు(వెస్టిండీస్ చేతిలో మూడు)
👉2024- మూడు(న్యూజిలాండ్ చేతిలో రెండు, ఇంగ్లండ్ చేతిలో ఒకటి).
కపిల్ దేవ్, అజారుద్దీన్‌తో పాటు రోహిత్
రోహిత్ శర్మ ఇప్పటి వరకు సొంతగడ్డపై 15 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. కివీస్ చేతిలో ఓటమితో తాజాగా అతడి ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. అంతకు ముందు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ సంయుక్తంగా ఇరవై టెస్టుల్లో సారథ్యం వహించి నాలుగేసి మ్యాచ్‌లు ఓడిపోయారు. ఈ జాబితాలో అత్యధికంగా 9 టెస్టు పరాజయాల(ఇరవై ఏడింట)తో మన్సూర్ అలీ పటౌడీ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు.
చదవండి: అస్సలు ఊహించలేదు.. ఇది సమిష్టి వైఫల్యం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment