న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా తడ‘బ్యాటు’ కొనసాగుతోంది. పుణెలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ రూపంలో ఆదిలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు.
కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసి రోహిత్ వికెట్ సమర్పించుకున్నాడు. ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, రోహిత్ అవుటైన తీరుపై టీమిండియా అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.
లంచ్ బ్రేక్ సమయానికిస్కోరు ఎంతంటే?
భారత రెండో ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ను సాంట్నర్ వేశాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతి అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా వచ్చి.. బౌన్స్ అయింది. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని బ్యాట్‌ను తాకి ఫీల్డర్ విల్ యంగ్ చేతిలో పడింది. దీంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా భోజన విరామ సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.
క్యాచ్‌లు కూడా వదిలేశాడు!
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ఈ టెస్టు మ్యాచ్‌లో పలు క్యాచ్‌లు డ్రాప్ చేసిన విషయం తెలిసిందే. అశ్విన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్(48*), రవీంద్ర జడేజా బౌలింగ్‌లో టామ్ బ్లండెల్(41) ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను హిట్‌మ్యాన్ వదిలేశాడు.
కాగా పుణె టెస్టులో న్యూజిలాండ్ భారత్‌కు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. ఇక తొలుత బెంగళూరులో జరిగిన టెస్టులో కివీస్ గెలిచి ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. బెంగళూరు టెస్టులోనూ రోహిత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులే చేసిన ఈ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ద శతకం(52)తో ఫర్వాలేదనిపించాడు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు(అక్టోబరు 24- 28)
వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణె
టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 259
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 156
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 255
టీమిండియా లక్ష్యం: 359.
చదవండి: IND vs NZ Day 3 Lunch: రోహిత్ ఔటైనా దూకుడుగా ఆడుతున్న భారత్
~ Can't Bat
~ Can't Bowl
~ Can't Run
~ Can't Field
~ Can't Captain
~ Can't Remain Fit
~ Can't Take Review
That's Captain Rohit Sharma for you!!🤡🤡 #INDvNZpic.twitter.com/EShOy7K6sO— ` (@krish_hu_yaar) October 26, 2024
Comments
Please login to add a commentAdd a comment