కొలంబో: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 2013 తర్వాత ఆసీస్‌పై శ్రీలంక వరుసగా రెండు వన్డేల్లో నెగ్గడం ఇదే ప్రథమం. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఫించ్ (62; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (70 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.
అనంతరం శ్రీలంక 48.3 ఓవర్లలో 4 వికెట్లకు 292 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ నిసాంక (137; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా... కుశాల్ మెండిస్ (87 రిటైర్డ్ హర్ట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
చదవండి: అతనొక్కడే.. 11 మంది కెప్టెన్లు.. భారత వెటరన్ ఖాతాలో అరుదైన రికార్డు
Comments
Please login to add a commentAdd a comment