CWC Qualifiers 2023: Sri Lanka Hammer West Indies In Super Six Final Match - Sakshi
Sakshi News home page

SL Vs WI: విండీస్‌కు మరో ఘోర పరాభవం.. ఇంతకంటే గొప్పగా ఏం చేయగలరు?! వారెవ్వా లంక..

Published Sat, Jul 8 2023 7:54 AM | Last Updated on Sat, Jul 8 2023 8:26 AM

CWC Qualifiers: Sri Lanka Hammer West Indies Super Six Final Match - Sakshi

ICC Cricket World Cup Qualifiers 2023- Sri Lanka vs West Indies- హరారే: వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ‘సూపర్‌ సిక్స్‌’ దశను కూడా శ్రీలంక జట్టు అజేయంగా ముగించింది. వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన చివరి ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 44.2 ఓవర్లలో ఛేదించింది.

దుమ్ములేపిన నిసాంక
నిసాంక (113 బంతుల్లో 104; 14 ఫోర్లు) సెంచరీ సాధించగా... దిముత్‌ కరుణరత్నే (92 బంతుల్లో 83; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక కుశాల్‌ మెండిస్‌ (34 నాటౌట్‌; 3 ఫోర్లు), సమరవిక్రమ (17 నాటౌట్‌; 1 ఫోర్‌) మూడో వికెట్‌కు అజేయంగా 40 పరుగులు జతచేశారు.

కీసీ కార్టీ ఒక్కడే
అంతకుముందు వెస్టిండీస్‌ 48.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. కీసీ కార్టీ (87; 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మహీశ్‌ తీక్షణ 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌తో శ్రీలంక తలపడుతుంది. ఫైనల్‌ చేరడంద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్‌ ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించాయి. 

ఇదిలా ఉంటే.. సూపర్‌ సిక్స్‌ దశలో ఆఖరి మ్యాచ్‌లోనూ విండీస్‌ పరాజయం పాలవడంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఇంతకంటే గొప్పగా ఏం చేయగలరు? మన ఆట తీరు మారదు కదా!’’ అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: బజ్‌బాల్‌ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement