ICC ODI World Cup qualifying tournament
-
అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు.. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే!
స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కాసెల్ రికార్డులకెక్కాడు. సోమవారం ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ లీగ్ 2లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాసెల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 21 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబడా పేరిట ఉండేది. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్ రికార్డును కాస్సెల్ బ్రేక్ చేశాడు. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్ రికార్డును కాస్సెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో వరల్డ్రికార్డును కూడా అతడు నమోదు చేశాడు. అరంగేట్రంలో తొలి రెండు బంతుల్లోనే వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా కాస్సెల్ నిలిచాడు. తను వేసిన మొదటి ఓవర్లో తొలి రెండు బంతుల్లో ఒమన్ బ్యాటర్లు జీషన్ మస్కూద్ అయాన్ ఖాన్‌లను ఔట్ చేసిన కాసెల్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేయలేకపోయాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఒమన్.. కాసెల్ దాటికి కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ 2 వికెట్లు కోల్పోయి చేధించింది.Charlie Cassell's sensational seven-for on debut has helped Scotland bowl Oman out for a modest total 👏Catch all the live #CWCL2 action on https://t.co/CPDKNxoJ9v 📺#SCOvOMA 📝: https://t.co/woV3zYu9sG | 📸: @CricketScotland pic.twitter.com/iGeeVoyvTc— ICC (@ICC) July 22, 2024 -
SL Vs WI: విండీస్‌కు మరో పరాభవం.. ఇంతకంటే గొప్పగా ఏం చేయగలరు?!
ICC Cricket World Cup Qualifiers 2023- Sri Lanka vs West Indies- హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ‘సూపర్ సిక్స్’ దశను కూడా శ్రీలంక జట్టు అజేయంగా ముగించింది. వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 44.2 ఓవర్లలో ఛేదించింది. దుమ్ములేపిన నిసాంక నిసాంక (113 బంతుల్లో 104; 14 ఫోర్లు) సెంచరీ సాధించగా... దిముత్ కరుణరత్నే (92 బంతుల్లో 83; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక కుశాల్ మెండిస్ (34 నాటౌట్; 3 ఫోర్లు), సమరవిక్రమ (17 నాటౌట్; 1 ఫోర్) మూడో వికెట్‌కు అజేయంగా 40 పరుగులు జతచేశారు. కీసీ కార్టీ ఒక్కడే అంతకుముందు వెస్టిండీస్ 48.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. కీసీ కార్టీ (87; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మహీశ్ తీక్షణ 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌తో శ్రీలంక తలపడుతుంది. ఫైనల్ చేరడంద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాయి. ఇదిలా ఉంటే.. సూపర్ సిక్స్ దశలో ఆఖరి మ్యాచ్‌లోనూ విండీస్ పరాజయం పాలవడంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఇంతకంటే గొప్పగా ఏం చేయగలరు? మన ఆట తీరు మారదు కదా!’’ అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
WC: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజాలతో..
ICC Cricket World Cup Qualifiers 2023 SCO Vs NED: వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్‌కు వచ్చే రెండు జట్లేవో తేలిపోయింది. మాజీ చాంపియన్ శ్రీలంక ఇంతకుముందే అర్హత సాధించగా, ఇప్పుడు నెదర్లాండ్స్ తమ చోటును ఖాయం చేసుకుంది. తప్పనిసరిగా నెగ్గాల్సిన గురువారం నాటి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్లతో స్కాట్లాండ్పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ అసాధారణ రీతిలో బ్రెండన్ మెక్‌ములన్ (106; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. బాస్ డి లీడె (5/52) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావాలంటే 44 ఓవర్లలోనే లక్ష్యం సాధించాల్సిన స్థితిలో నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. ఆ జట్టు 42.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు సాధించింది. బాస్ దంచికొట్టాడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బాస్ డి లీడె (92 బంతుల్లో 123; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... విక్రమ్‌జిత్ సింగ్ (40), సాఖిబ్ జుల్ఫికర్ (33 నాటౌట్) రాణించారు. 36 ఓవర్లు ముగిసేవరకు కూడా మ్యాచ్ స్కాట్లాండ్ నియంత్రణలోనే ఉంది. 8 ఓవర్లలో నెదర్లాండ్స్ 85 పరుగులు చేయాల్సి ఉంది. తర్వాతి 4 ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 4 ఓవర్లలో 45కు మారింది. ఈ సమయంలో డి లీడె ఒక్క సారిగా టి20 తరహా ఆటను చూపించాడు. వాట్ వేసిన ఓవర్లో 2 సిక్స్‌లు, మెక్‌ములెన్ వేసిన తర్వాతి ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో మొత్తం 42 పరుగులు వచ్చేశాయి. 84 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. డి లీడె రనౌటైనా, వాన్ బీక్ సింగిల్ తీయడంతో డచ్ శిబిరంలో సంబరాలు షురూ అయ్యాయి. తొలి డచ్ క్రికెటర్‌గా ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సెంచరీ హీరో బాస్ డి లీడె అరుదైన రికార్డు సాధించాడు. డచ్ క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన నిలిచాడు. వన్డేల్లో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు డి లీడె. గతంలో వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్), కాలింగ్‌వుడ్ (ఇంగ్లండ్), రోహన్ ముస్తఫా (యూఏఈ) మాత్రమే ఈ ఘనత సాధించారు. తొలి ప్లేయర్ వివియన్ రిచర్డ్స్ 1987లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వివ్ రిచర్డ్స్ 119 పరుగులు చేయడంతో పాటు 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్‌తో 2005 నాటి మ్యాచ్‌లో పాల్ కాలింగ్‌వుడ్ సెంచరీ సాధించడంతో పాటు ఆరు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ కెప్టెన్ రోహన్ ముస్తఫా 2017లో పపువా న్యూ గినియాతో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో
CWC Qualifiers 2023: వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు నెదర్లాండ్స్ తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై తప్పనిసరిగా గెలవాలి. లక్ష్యం 278 పరుగులు... అదీ 44 ఓవర్లలో సాధిస్తేనే బెర్త్ దక్కుతుంది. అంతకంటే ఒక్క బంతి ఎక్కువ తీసుకొని మ్యాచ్ గెలిచినా లాభం లేదు. స్కాట్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తక్కువ వ్యవధిలో ఒక్కో వికెట్ కోల్పోతూ వచ్చిన జట్టు ఒక దశలో 163/5 వద్ద నిలిచింది. 79 బంతుల్లోనే మరో 115 పరుగులు కావాలి. ఇలాంటి స్థితిలో బాస్ డి లీడె ఒక్కసారిగా చెలరేగిపోయాడు. తర్వాతి 40 బంతుల్లోనే 76 పరుగులు సాధించి జట్టుకు సంచలన విజయం అందించాడు. డి లీడె శతకానికి తోడు జుల్ఫికర్ అండగా నిలవడంతో నెదర్లాండ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరి ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ‘సూపర్ సిక్స్’ దశలో జింబాబ్వేను ఓడించి ఆ జట్టును వరల్డ్ కప్‌కు దూరం చేసి తమ అవకాశాలు మెరుగుపర్చుకున్న స్కాట్లాండ్ అనూహ్య ఓటమితో నిష్క్రమించింది. వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించడం ఇది ఐదోసారి. 2011 తర్వాత మళ్లీ భారత్‌లోనే ఆ జట్టు బరిలోకి దిగుతోంది. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2003 వన్డే వరల్డ్ కప్... పార్ల్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 68 పరుగుల తేడాతో ఓడింది. అయితే సచిన్ టెండూల్కర్ సహా 4 వికెట్లు తీసిన టిమ్ డి లీడె ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతని కొడుకే ఈ బాస్ డి లీడె. టోర్నీ ఆసాంతం నిలకడైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతను జట్టును ముందుకు నడపడంలో కీలకపాత్ర పోషించాడు. 285 పరుగులు చేయడంతో పాటు డి లీడె 15 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రధాన ఆటగాళ్లు తప్పుకొన్నా.. కౌంటీల్లో ఒప్పందాల కారణంగా పలువురు ప్రధాన ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నా... డి లీడె మాత్రం రెండిటిలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్నే ఎంచుకున్నాడు. సీనియర్లు లేకపోయినా స్ఫూర్తిదాయక ఆటతో డచ్ బృందం సత్తా చాటింది. గ్రూప్ దశలో జింబాబ్వే చేతిలో ఓడినా అమెరికా, నేపాల్‌పై సునాయాస విజయాలు సాధించింది. విండీస్‌తో మ్యాచ్ ఆ జట్టు స్థాయిని చూపించింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ తడబడకుండా స్కోరు సమం చేయగలిగింది. తేజ అద్భుతంగా ఆడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తేజ నిడమనూరు అద్భుత సెంచరీతో చెలరేగగా, కీలకమైన సూపర్ ఓవర్లో వాన్ బీక్ 30 పరుగులు కొట్టి జట్టును గెలిపించాడు. ‘సూపర్ సిక్స్’ దశలో ఒమన్‌పై భారీ విజయం జట్టుకు మేలు చేయగా, ఇప్పుడు స్కాట్లాండ్పై గెలుపు ఆ జట్టును ప్రధాన టోరీ్నకి చేర్చింది. 4 అర్ధ సెంచరీలు చేసిన స్కాట్ ఎడ్వర్డ్స్, మరో సెంచరీ చేసిన విక్రమ్‌జిత్ సింగ్‌తో పాటు బౌలింగ్‌లో వాన్ బీక్, ర్యాన్ క్లీన్ కీలక పాత్ర పోషించారు. ‘భారత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది నా కల’ అని తేజ కొన్నాళ్ల క్రితం ‘సాక్షి’తో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అతను భారత్‌పైనే వరల్డ్ కప్ మ్యాచ్ ఆడబోతుండటం విశేషం. నవంబర్ 11న బెంగళూరులో భారత్‌తో తలపడే నెదర్లాండ్స్... అక్టోబర్ 6న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో హైదరాబాద్‌లో ఆడుతుంది. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇంతకంటే దిగజారడం ఉండదు: విండీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు
ICC Cricket World Cup Qualifiers 2023: ‘‘చాలా కాలంగా జట్టు వైఫల్యం కొనసాగుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 స్టేజ్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడిలా! పరిమిత ఓవర్ల క్రికెట్లో రోజురోజుకీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇక ఇంతకంటే దిగజారడం ఇంకేమీ ఉండదేమో’’ అని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షాయీ హోప్ బృందం కనీసం వన్డే వరల్డ్‌కప్-2023 ప్రధాన పోటీకి అర్హత సాధించని నేపథ్యంలో జట్టు ఆట తీరును విమర్శించాడు. కాగా జింబాబ్వే వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో విండీస్ దారుణ వైఫల్యాలు మూటగట్టుకుంది. గ్రూప్ స్టేజిలో జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఇక సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఏవైనా అద్భుతాలు జరగాలని కోరుకోవడమే తప్ప విండీస్ చేతిలో ఇంకేమీ మిగల్లేదు. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కరేబియన్ జట్టుకు ఈ దుస్థితి పట్టడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్లోస్ బ్రాత్‌వైట్ ఐసీసీ షోలో మాట్లాడుతూ.. షాయీ హోప్ బృందంపై విమర్శలు గుప్పించాడు. ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇక విండీస్ లెజండరీ పేసర్ ఇయాన్ బిషప్.. ‘‘మేటి జట్లపై మేము మెరుగ్గా ఆడి.. నిలకడైన ప్రదర్శన కనబరిచి దశాబ్దానికి పైగానే అయింది. కరేబియన్ జట్టు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఒకరో ఇద్దరో పోరాడితే సరిపోదు. అంతా కలిసి కట్టుగా ముందుకు రావాల్సి ఉంది’’ అంటూ విండీస్ క్రికెట్ బోర్డులో కుమ్ములాటలు, మ్యాచ్ ఫీజులపై పేచీలు తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావించాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. జూలై 12 నుంచి సొంతగడ్డపై టీమిండియాతో విండీస్ టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. చదవండి: వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్‌కు ఇంకా ఛాన్స్.. అది ఎలా అంటే? ఆరోజు నాకు అన్యాయం చేసి ధోనికి అవార్డు ఇచ్చారు! ఎందుకంత ఏడుపు.. -
WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు!
ICC Cricket World Cup Qualifiers 2023- SCO Vs WI: ‘‘ఇప్పుడేమీ అంతా ముగిసిపోలేదు. జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. వెస్టిండీస్ క్రికెట్‌కు కచ్చితంగా మళ్లీ పూర్వవైభవం తీసుకురాగలరు. సీనియర్లుగా మేము చేయాల్సిందల్లా.. వాళ్ల నైపుణ్యాలను మెరుగుపరచుకునే దిశగా పూర్తిస్థాయిలో అండగా నిలవడమే! లోపాలు సరిదిద్దుకుని ముందుకు సాగాలి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాలి’’ అని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ అన్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే పడిలేచిన కెరటంలా తాము మళ్లీ క్రికెట్లో పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరీ ఘోరంగా రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్.. ఈసారి కనీసం ప్రధాన పోటీకి కూడా అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్ సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్ చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. పసికూన చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన మాజీ చాంపియన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో విండీస్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పటి చాంపియన్స్ మరీ ఇంత అవమానకరంగా మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ అద్భుతాలు చేయగలం ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టులో బ్లేమ్ గేమ్ మొదలుకాగా.. 31 ఏళ్ల జేసన్ హోల్డర్ మాత్రం ఆశావహ దృక్పథంతో ఉండటం విశేషం. ఆటలో గెలుపోటములు సహజమేనని... అయితే, ఇప్పటికైనా లోపాలు సరిదిద్దుకునే అంశంపై దృష్టిసారించాలని పేర్కొన్నాడు. అదే విధంగా.. సరైన గైడెన్స్ ఉంటే యువ ఆటగాళ్లతో మళ్లీ అద్భుతాలు చేయవచ్చని పేర్కొన్నాడు. భేదాభిప్రాయాలు పక్కనపెట్టి సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని 31 ఏళ్ల జేసన్ హోల్డర్ చెప్పుకొచ్చాడు. కాగా స్కాట్లాండ్తో మ్యాచ్‌లో 45 పరుగులతో విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన హోల్డర్.. స్కాట్లాండ్ ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్బ్రిడే వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక జూలై 7న సూపర్ సిక్సెస్‌లో తమ చివరి మ్యాచ్ ఆడనున్న విండీస్.. జూలై 12 నుంచి టీమిండియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధం కానుంది. స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు: టాస్: స్కాట్లాండ్- బౌలింగ్ వెస్టిండీస్- 181 (43.5) స్కాట్లాండ్- 185/3 (43.3) విజేత: ఏడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ మెక్‌ములెన్ (3 వికెట్లు, 69 పరుగులు). చదవండి: రెండు ప్రపంచకప్‌లలో ఎదురేలేని గెలుపు! కానీ ఇప్పుడు.. విండీస్ దుస్థితికి కారణాలివే మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ -
రెండు ప్రపంచకప్‌లలో ఎదురేలేని గెలుపు! కానీ ఇప్పుడు.. విండీస్ దుస్థితికి కారణాలివే
వెస్టిండీస్... ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు. కరీబియన్ బౌలింగ్ అంటేనే బ్యాటర్లు బెంబేలెత్తేవారు. తొలి రెండు ప్రపంచకప్ (1975, 1979) టోర్నీలను ఎదురేలేకుండా గెలుచుకుంది. మూడో ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అయితే ఇది గతం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జట్టు ఇప్పుడు భారత్‌కు రావడం లేదన్నది వర్తమానం. అంటే వన్డే ప్రపంచకప్‌కు కరీబియన్ జట్టు దూరమైంది. క్వాలిఫయింగ్ దశలోనే ఇంటికెళ్లనుంది. ఇది విండీస్ అభిమానులకే కాదు... క్రికెట్ విశ్లేషకులకు పెద్ద షాక్! ICC Cricket World Cup Qualifiers 2023- హరారే: వెస్టిండీస్ ప్రపంచకప్ ముచ్చట జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయర్స్‌లోనే ముగిసిపోయింది. వన్డే మెగా టోరీ్నలో ఆడే అర్హత కోల్పోయింది. ‘సూపర్ సిక్స్’ దశలో స్కాట్లాండ్ చేతిలో పరాభవంతో కరీబియన్ జట్టు ని్రష్కమణ అధికారికంగా ఖరారైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విండీస్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో బ్రాండన్ కింగ్ (22 బంతుల్లో 22; 5 ఫోర్లు) రెండు పదుల స్కోరు చేస్తే మిగతా ఇద్దరు చార్లెస్ (0), బ్రూక్స్ (0) ఖాతానే తెరువలేదు. కెప్టెన్ షై హోప్ (13), కైల్ మేయర్స్ (5) చెత్తగానే ఆడారు. 60 పరుగులకే టాప్–5 వికెట్లను కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో నికోలస్ పూరన్ (43 బంతుల్లో 21; 2 ఫోర్లు) పెద్దగా మెప్పించలేదు. తలరాతను తలకిందులు చేశాడు షెఫర్డ్ (43 బంతుల్లో 36; 5 ఫోర్లు)తో కలిసిన హోల్డర్ (79 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఏడో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆదుకున్నాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్‌ములెన్ 3, క్రిస్ సోల్, మార్క్‌వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలిచింది. ఓపెన్ మాథ్యూ క్రాస్ (107 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు), మెక్‌ములెన్ (106 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించి విండీస్ ‘కప్’ రాతను కాలరాశారు. కరీబియన్‌కు ఎందుకీ దుస్థితి? జింబాబ్వేకు వచి్చన వెస్టిండీస్ జట్టులోని సభ్యుల్లో ప్రపంచకప్‌కు అర్హత సాధించాలి... భారత్‌కు వెళ్లాలి అన్న కసి, పట్టుదల కనిపించనే లేదు. అవే ఉంటే ఫీల్డింగ్ ఇంత ఘోరంగా చేయరు. బౌలింగ్ ఎంత పేలవం అంటే... నెదర్లాండ్స్‌తో కీలకమైన సూపర్ ఓవర్లో బౌండరీలు దాటే ఆరు బంతులు (4, 6, 4, 6, 6, 4; హోల్డర్ బౌలర్) వేయరు. నిలకడేలేని బ్యాటింగ్‌తో ఆడరు. ఇలా అన్ని రంగాల్లో చెత్త ప్రదర్శన వల్లే రెండుసార్లు ‘విజేత’ తాజా ‘అనర్హత’ అయ్యింది. ఇప్పుడు మిగతా ‘సూపర్ సిక్స్’ దశలో ఒమన్, శ్రీలంకలతో ఆడి ఇంటికెళ్లిపోవడమే మిగిలింది. వెస్టిండీస్ అంటేనే ఒకప్పుడు అరివీర భయంకర బౌలర్లు, దంచికొట్టే బ్యాటింగ్ ఆజానుబాహులు గుర్తొచ్చేవారు. కానీ ప్రస్తుతం నామమాత్రంగా జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు... ఫ్రాంచైజీ లీగ్‌ల్లో మాత్రం మెరిపించే వీరులు కనబడుతున్నారు. విండీస్ బోర్డు కుమ్ములాటలు, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులపై తరచూ పేచీలతో స్టార్ ఆటగాళ్లంతా టీమ్ స్పిరిట్ మరిచి వ్యక్తిగతంగా కలిసొచ్చే టి20 లీగ్‌లపై కష్టపడటం నేర్చారు. దీంతో అసలైన సంప్రదాయ క్రికెట్ (టెస్టు), పరిమిత ఓవర్ల ఆట (వన్డే)లను పట్టించుకోవడం మానేశారు. జట్టుగా పట్టుదలతో ఆడటం అనే దాన్నే మర్చిపోయారు. ఇప్పుడు కరీబియన్ ఆటగాళ్లంతా ఐసీసీ తయారు చేసిన భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)ను పూర్తి చేస్తున్నారు. కానీ విండీస్ భవిష్యత్తుకు అవసరమైన షెడ్యూల్‌ను ఎప్పుడో పక్కన బెట్టేశారు. అందువల్లే వెస్టిండీస్ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్
ICC Cricket World Cup Qualifiers 2023- Scotland Beat West Indies by 7 wkts: ‘‘ఆది నుంచే మా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ టోర్నీ సవాలుతో కూడుకున్నదని తెలుసు. నిజానికి ఈ మ్యాచ్‌లో మేము టాస్ గెలిస్తే బాగుండేది. ఇలాంటి పిచ్ మీద ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకుంటాడు. ఆ విషయంలో మాకేదీ కలిసిరాలేదు. క్యాచ్‌లు వదిలేయడాలు, మిస్‌ఫీల్డింగ్ తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆటలో ఇవన్నీ సహజమే! కానీ ప్రతిసారీ వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టలేము కదా! ఆటలో ఇవన్నీ సహజమే! వాస్తవానికి టోర్నీ ఆరంభానికి ముందే.. స్వదేశంలోనే మేము పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సింది. సరైన సన్నాహకాలు లేకుండా నేరుగా వెళ్లి గొప్పగా ఆడాలంటే అన్నివేళలా కుదరకపోవచ్చు. గెలవాలనే పట్టుదల, కసి మిగిలిన మ్యాచ్‌లలో గెలిచైనా మా అభిమానులకు కాస్త వినోదం పంచుతాం. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదు. కానీ నిలకడగా ఆడలేకపోవడమే మా కొంపముంచింది. స్కాట్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా వాళ్ల బౌలర్లు మెరుగ్గా రాణించారు. గెలవాలనే పట్టుదల, కసి వారిలో కనిపించాయి. మేము వాళ్లను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. తిరిగి వెళ్లిన తర్వాత డారెన్ సామీతో కలిసి మా జట్టులోని లోపాలను సరిచేసుకోవడంపై దృష్టి సారిస్తాం’’ అని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. స్కాట్లాండ్ చేతిలో ఓడి రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ జట్టు వన్డే వరల్డ్‌కప్-2023లో క్వాలిఫయర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. జింబాబ్వేలో జరిగిన సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌కప్ రేసు నుంచి అవుట్ తద్వారా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2023లో అడుగుపెట్టే అర్హత కోల్పోయింది. మాజీ చాంపియన్ ఇలా అవమానకరరీతిలో నిష్క్రమించడం అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తోంది. మా ఓటమికి ప్రధాన కారణం అదే ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విండీస్ సారథి షాయీ హోప్ మాట్లాడుతూ.. టాస్ ఓడిపోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. హరారేలో శనివారం నాటి మ్యాచ్‌లో తాము తొలుత బ్యాటింగ్ చేయాల్సి రావడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పరోక్షంగా టాస్ ఓడటమే కారణమని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో స్కాట్లాండ్ బౌలర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించిన హోప్.. తమ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. టోర్నీ మొత్తం తమకు నిరాశనే మిగిల్చిందని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా సూపర్ సిక్సెస్‌లో విండీస్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జూలై 5న ఒమన్, జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్ తలపడాల్సి ఉంది. ఈ రెండు నామమాత్రపు మ్యాచ్‌లలో గెలిచైనా గౌరవప్రదంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని కరేబియన్ జట్టు భావిస్తోంది. స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు: టాస్: స్కాట్లాండ్- బౌలింగ్ వెస్టిండీస్- 181 (43.5) స్కాట్లాండ్- 185/3 (43.3) విజేత: ఏడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ మెక్‌ములెన్ (3 వికెట్లు, 69 పరుగులు). చదవండి: పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే! పసికూన చేతిలో చిత్తు! వరల్డ్‌కప్ నుంచి అధికారికంగా అవుట్ -
విండీస్‌కు ఘోర అవమానం.. పసికూన చేతిలో చిత్తు! వరల్డ్‌కప్ నుంచి అధికారికంగా అవుట్
ICC Cricket World Cup Qualifiers 2023: మాజీ చాంపియన్ వెస్టిండీస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఒకప్పటి ఈ మేటి జట్టు ఈసారి కనీసం ప్రధాన పోటీకి కూడా అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. పసికూన స్కాట్లాండ్ చేతిలో చిత్తుగా ఓడి అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక .. వెస్టిండీస్ నిష్క్రమణతో సూపర్ సిక్సెస్‌లో ఇప్పటికే చెరో విజయం సాధించిన జింబాబ్వే, శ్రీలంకకు టాప్-10లో నిలిచేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు.. ఒకప్పుడు క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన విండీస్ స్కాట్లాండ్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడి అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ భారంగా వెనుదిరిగింది. టాప్-8లో ఆ జట్లు కాగా వన్డే ప్రపంచకప్-2023 ఆతిథ్య టీమిండియా సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ మెగా ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఈ ఎనిమిది జట్లతో క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్సెస్ దశలో టాప్-2లో నిలిచిన టీమ్‌లు వరల్డ్‌కప్ టోర్నీలో అడుగుపెడతాయి. ఇందుకోసం జింబాబ్వే వేదికగా శ్రీలంక, వెస్టిండీస్‌తో పాటు అసోసియేట్ దేశాలు తలపడగా.. గ్రూప్- ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి. నెదర్లాండ్స్ చేతిలోనూ ఓడి ఈ క్రమంలో జింబాబ్వే ఒమన్‌ను, శ్రీలంక నెదర్లాండ్స్‌ను ఓడించి వరల్డ్‌కప్ ఈవెంట్‌కు అర్హత సాధించే క్రమంలో ముందడుగు వేశాయి. దీంతో ఇప్పటికే రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకపడి ఉన్న విండీస్.. తమకు మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పక భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి. కానీ.. తొలి మ్యాచ్‌లోనే అది కూడా స్కాట్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడటం వెస్టిండీస్ చెత్త ఆట తీరుకు అద్దం పట్టింది. కాగా గ్రూప్ దశలో నెదర్లాండ్స్ చేతిలోనూ విండీస్ చిత్తు కావడం గమనార్హం. మ్యాచ్ సాగిందిలా ఇక మ్యాచ్ విషయానికొస్తే.. హరారే వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 43.5 ఓవర్లకే చాపచుట్టేసింది. స్కాటిష్ బౌలర్ల విజృంభణకు తట్టుకోలేక 181 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో జేసన్ హోల్డర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్.. ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్బ్రిడ్ డకౌట్ కావడంతో ఆదిలోనే తడబడింది. అయితే, మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ క్రాస్ అద్భుతంగా ఆడాడు. 74 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక బంతి(3 వికెట్లు)తో మెరిసిన వన్‌డౌన్ బ్యాటర్ బ్రాండన్ మెక్‌ములెన్ 69 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే! Scotland trump the West Indies and the two-time champions are out of contention to reach #CWC23 😱#SCOvWI: https://t.co/D0FGi8lXDh pic.twitter.com/zQ0LVGYKCE — ICC (@ICC) July 1, 2023 -
WC 2023: వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చిన స్కాట్లాండ్! మరీ ఘోరంగా..
ICC Cricket World Cup Qualifiers 2023 Scotland vs West Indies: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్ సూపర్ సిక్సెస్‌లో తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. పసికూన స్కాట్లాండ్ చేతిలో 181 పరుగులకే ఆలౌట్ అయింది. స్కాటిష్ బౌలర్ల ధాటికి విండీస్ టాపార్డర్ చేతులెత్తేసింది. ఇక లోయర్ ఆర్డర్లో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ రాణించడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. టాపార్డర్ కుదేలు సూపర్ సిక్సెస్ మ్యాచ్ 3లో భాగంగా విండీస్- స్కాట్లాండ్ హరారే వేదికగా తలపడుతున్నాయి. శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. పూరన్, హోల్డర్ ఇన్నింగ్స్ వల్ల ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ డకౌట్‌గా వెనురిగాడు. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్(22) కాసేపు పోరాడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రూక్స్ సున్నాకే పరిమితం కావడంతో విండీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ షాయీ హోప్(13), కైలీ మేయర్స్(5) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన నికోలస్ పూరన్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హోల్డర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రొమారియో షెఫర్డ్ 36 పరుగులతో రాణించాడు. దీంతో 43.5 ఓవర్లలో 181 రన్స్ చేసి వెస్టిండీస్ ఆలౌట్ అయింది. రేసులో నిలవాలంటే అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిందే స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాండన్ మెక్ములెన్కు అత్యధికంగా మూడు.. క్రిస్ సోలే, మార్క్ వాట్, క్రిస్ గ్రేవ్స్ రెండేసి వికెట్లు తీశారు. సఫ్యాన్ షరీఫ్‌నకు ఒక వికెట్ దక్కింది. ఇక వెస్టిండీస్ వరల్డ్‌కప్-2023 అర్హత రేసులో నిలవాలంటే సూపర్ సిక్స్‌లో అన్ని మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఇప్పటికే జింబాబ్వే, శ్రీలంక ముందడుగు వేయగా.. పసికూన స్కాట్లాండ్తో మ్యాచ్‌లోనూ విండీస్ ఈ మేరకు దారుణ ప్రదర్శన కనబరచడం గమనార్హం. రన్‌రేటు పరంగా భారీగా వెనుకబడి ఉన్న షాయీ హోప్ బృందం ఒకవేళ స్కాట్లాండ్ను చిత్తుగా ఓడిస్తే ఇప్పటికి ప్రపంచకప్ ఆశలు సజీవంగా ఉంటాయి. చదవండి: కోటి చాలదు! వద్దే వద్దు! ఇంకా పెంచుతాం.. బీసీసీఐ హామీ.. ఎట్టకేలకు.. Ind Vs WI: టీమిండియా కొత్త స్పాన్సర్ ఇదే: బీసీసీఐ కీలక ప్రకటన -
WC 2023: వెస్టిండీస్ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే!
బులవాయో: మరోసారి సమష్టి ప్రదర్శనతో అదరగొట్టిన జింబాబ్వే జట్టు వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి అర్హత సాధించే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన జింబాబ్వే... గురువారం మొదలైన ‘సూపర్ సిక్స్’ దశలోనూ శుభారంభం చేసింది. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన ఒమన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 332 పరుగులు సాధించింది. వన్‌డౌన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ (103 బంతుల్లో 142; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడి ఈ టోర్నీ రెండో సెంచరీ, కెరీర్లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రజా, విలియమ్స్ అదుర్స్ సికందర్ రజా (49 బంతుల్లో 42; 6 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు సీన్ విలియమ్స్ 102 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. చివర్లో ల్యూక్ జోంగ్వి (28 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో జింబాబ్వే భారీ స్కోరు నమోదు చేసింది. ఒమన్ బౌలర్ ఫయాజ్ భట్ 79 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కశ్యప్ ప్రజాపతి సెంచరీ ఇక 333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 318 పరుగులు చేసి ఓడిపోయింది. గుజరాత్లో జన్మించి ఒమన్ జట్టుకు ఆడుతున్న ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి (97 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. ఆకీబ్ ఇలియాస్ (45; 5 ఫోర్లు), జీషాన్ మక్సూద్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), అయాన్ ఖాన్ (47; 5 ఫోర్లు), నదీమ్ (30 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా పోరాడటంతో ఒకదశలో ఒమన్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. తప్పని ఓటమి అయితే కీలక తరుణాల్లో జింబాబ్వే బౌలర్లు వికెట్లు పడగొట్టి ఒమన్ ఓటమిని ఖరారు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చటారా, ముజరబాని మూడు వికెట్ల చొప్పున తీయగా... ఎన్గరవాకు రెండు వికెట్లు దక్కాయి. సీన్ విలియమ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే రెండో ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో శ్రీలంక తలపడుతుంది. విండీస్ కొంపముంచిన జింబాబ్వే.. ‘టాప్ ర్యాంక్’లోకి దూసుకొచ్చి ఒమన్‌పై విజయంతో జింబాబ్వే ‘సూపర్ సిక్స్’ దశలో ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. లీగ్ దశలో గ్రూప్ ‘ఎ’లోని నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లపై జింబాబ్వే గెలవడం... ఆ రెండు జట్లు కూడా ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకోవడంతో... జింబాబ్వే ‘సూపర్ సిక్స్’ పోటీలను నాలుగు పాయింట్లతో మొదలుపెట్టింది. ఒక్కటి ఓడినా అంతే సంగతులు! తాజాగా ఒమన్‌పై నెగ్గిన జింబాబ్వే రెండు పాయింట్లు సాధించింది. జింబాబ్వే రన్‌రేట్ కూడా (0.75) బాగుంది. ఫలితంగా రన్‌రేట్‌లో చాలా వెనుకబడ్డ వెస్టిండీస్ (–0.35) జట్టు వన్డే ప్రపంచకప్‌కు అర్హత పొందాలంటే ‘సూపర్ సిక్స్’లో మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ‘సూపర్ సిక్స్’లో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరే రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు లభిస్తాయి. ఇందుకోసం ఒకప్పుడు మేటి జట్లుగా పేరొందిన వెస్టిండీస్, శ్రీలంక ప్రధానంగా పోటీపడతాయని భావించగా.. అనూహ్యంగా జింబాబ్వే రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఇక రన్‌రేటు పరంగా వెనుకబడి ఉన్న విండీస్ ఒక్క మ్యాచ్ ఓడినా వరల్డ్‌కప్-2023 ఆశలు వదులుకోకతప్పని దుస్థితి నెలకొంది. కాగా సూపర్‌సిక్స్‌లో భాగంగా విండీస్ శనివారం తమ మొదటి మ్యాచ్ స్కాట్లాండ్తో ఆడనుంది. చదవండి: టీమిండియాతో టెస్టులకు సై.. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్.. వాళ్లంతా జట్టుకు దూరం -
విండీస్‌కు నెదర్లాండ్స్ షాక్.. సూపర్ ఓవర్! 30 పరుగులతో బౌలర్ విధ్వంసం
ICC Cricket World Cup Qualifiers 2023: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో వెస్టిండీస్‌కు నెదర్లాండ్స్ ఊహించని షాకిచ్చింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో తొలుత స్కోరు సమం చేసిన డచ్ జట్టు.. సూపర్ ఓవర్లో సంచలన విజయం సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్ లోగన్ వాన్ బీక్ సూపర్ ఓవర్లో వరుసగా 4,6,4,6,6,4 బాది సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. పూరన్ అజేయ సెంచరీ వృథా హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో విండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (76), చార్ల్స్ (54) అర్ధ శతకాలతో శుభారంభం అందించారు. కెప్టెన్ షాయీ హోప్ 47 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నికోలస్ పూరన్ 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో కీమోపాల్ మెరుపు ఇన్నింగ్స్(25 బంతుల్లో 46 పరుగులు) ఆడాడు. దీంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 374 పరుగులు చేసింది. తేజ నిడమనూరు సెంచరీ ఇక లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ ఆదిలో కాస్త తడబడినా.. ఆంధ్ర మూలాలున్న బ్యాటర్ తేజ నిడమనూరు అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. 76 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (67) రాణించాడు. చివర్లో లోగన్ వాన్ బీక్(28), ఆర్యన్ దత్ (16) మెరుపులు మెరిపించగా ఇరు జట్ల స్కోరు సమమైంది. వీరవిహారం చేసిన బౌలర్ ఈ క్రమంలో మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాన్ బీక్ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. అంతేకాదు బంతితోనూ మ్యాజిక్ చేశాడు. 32 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్‌లో చార్ల్స్ తొలుత సిక్సర్ కొట్టగా.. రెండో బంతికి హోప్ ఒక పరుగు తీశాడు. అయితే, ఆ మరుసటి రెండు బంతుల్లో వాన్ బీక్.. చార్ల్స్, హోల్డర్లను వరుసగా అవుట్ చేశాడు. ఈ క్రమంలో విజయం నెదర్లాండ్స్ సొంతమైంది. దీంతో విండీస్‌కు పసికూన చేతిలో ఊహించిన షాక్ తగిలినట్లయింది. వాన్ బీక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే క్వాలిఫయర్స్‌లో గ్రూప్-ఏలో ఉన్న జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ ఇప్పటికే సూపర్ సిక్సెస్‌కు చేరుకున్నాయి. చదవండి: అమెరికాలో.. దిగ్గజ క్రికెటర్లతో సంజూ శాంసన్! ఫొటో వైరల్ ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా.. -
కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత..
ICC Cricket World Cup Qualifiers 2023: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసింది. హరారే వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో యూఎస్ఏను ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన జట్టుగా టీమిండియా తర్వాతి స్థానంలో నిలిచింది. ఇప్పటికే సూపర్ సిక్సెస్‌లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో ఇప్పటికే సూపర్ సిక్సెస్‌కు అర్హత సాధించిన జింబాబ్వే జూన్ 26న యూఎస్ఏతో నామమాత్రపు మ్యాచ్‌లో తలపడింది. టాస్ గెలిచిన యూఎస్ఏ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ ఊచకోత.. ఏకంగా వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ సీన్ విలియమ్స్ 101 బంతుల్లో ఏకంగా 21 ఫోర్లు, 5 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. 174 పరుగులు సాధించాడు. ఓపెనర్ గుంబీ 78 పరుగులు సాధించగా.. సికందర్ రజా 48, రియాన్ బర్ల్ 47 పరుగులతో రాణించారు. మరీ దారుణం ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన యూఎస్ఏ 104 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్ల సమిష్టి ప్రదర్శన కారణంగా 25.1 ఓవర్లకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ బ్యాటర్లు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0.6,9,8,13,0,24,2,21,6,0. బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో.. ముఖ్యంగా టాపార్డర్ దారుణ వైఫల్యం కారణంగా యూఎస్ఏకు 304 పరుగుల భారీ తేడాతో ఓటమి తప్పలేదు. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన జింబాబ్వే సారథి సీన్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీమిండియా తర్వాతి స్థానం జింబాబ్వేదే యూఎస్ఏపై సంచలన విజయం నమోదు చేసిన జింబాబ్వే వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. మేటి జట్లను వెనక్కి నెట్టి.. టీమిండియా తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయాలివే ►2023- తిరువనంతపురంలో శ్రీలంక మీద భారత్- 317 పరుగులు ►2023- హరారేలో యూఎస్ఏ మీద జింబాబ్వే- 304 పరుగులు ►2008- అబెర్డీన్లో ఐర్లాండ్ మీద న్యూజిలాండ్- 290 పరుగులు ►2015- పెర్త్‌లో అఫ్గనిస్తాన్ మీద ఆస్ట్రేలియా- 275 పరుగులు ►2010- బెనోనిలో జింబాబ్వే మీద సౌతాఫ్రికా-272 పరుగుల తేడాతో విజయం సాధించాయి. చదవండి: ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా.. ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ.. -
ICC CWC Qualifier 2023: అమెరికాకు మరో బిగ్ షాక్.. నేపాల్ సంచలన విజయం
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)లో నేపాల్ బోణీ కొట్టింది. హరారే వేదికగా యూఎస్ఏ(అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 43 ఓవర్లలో ఛేదించింది. నేపాల్ బ్యాటర్లలో భీమ్ షాక్రి(77) పరుగులతో అజేయంగా నిలవగా.. కుశాల్ భుర్టెల్(39), దీపేంద్ర సింగ్(39) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో టేలర్, ఎన్ పటేట్, సౌరభ్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. నేపాల్ బౌలర్లలో నిప్పులు చేరగడంతో 207 పరుగులకే ఆలౌటైంది. యూఎస్ఏ బ్యాటర్లలో షాయన్ జహంగీర్(100 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక నేపాల్ బౌలర్లలో కరణ్ 4 వికెట్లతో యూఏస్ఏను దెబ్బతీయగా.. గుల్సాన్ ఝా మూడు వికెట్లు సాధించాడు. నేపాల్ తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం వెస్టిండీస్‌తో తలపడనుండగా.. యూఎస్ఏ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. శుబ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్! రుత్‌రాజ్ రీ ఎంట్రీ -
సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)ఆతిథ్య జట్టు జింబాబ్వే ఎదురులేకుండా దూసుకెళుతుంది. టోర్నీలో జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సికందర్ రజా (54 బంతుల్లోనే 102 పరుగులు) వీరోచిత సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో వన్డేల్లో జింబాబ్వే తరపున వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్‌గా సికందర్ రజా గుర్తింపు పొందాడు. కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. విక్రమ్‌జిత్ సింగ్(88 పరుగులు), మాక్స్ ఒడౌడ్(59 పరుగులు), స్కాట్ ఎడ్వర్డ్స్(83 పరుగులు) రాణించగా.. సికందర్ రజా 55 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం 316 టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 40.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. క్రెయిగ్ ఇర్విన్(50 పరుగులు), సీన్ విలియమ్స్(91 పరుగులు) రాణించగా.. సికందర్ రజా(54 బంతుల్లో 102 నాటౌట్, ఆరు ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. Hosts Zimbabwe make it two wins out of two after Sikandar Raza's heroics ✌️ 📝: #ZIMvNED: https://t.co/6sP9VYrxb0 | #CWC23 pic.twitter.com/u52nPJgmF6 — ICC Cricket World Cup (@cricketworldcup) June 20, 2023 చదవండి: బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
వరల్డ్‌కప్ క్వాలిఫియర్ మ్యాచ్‌లకు సర్వం సిద్దం.. ఫోటోలకు ఫోజులిచ్చిన కెప్టెన్లు
వన్డే వరల్డ్‌కప్-2023 కోసం ఆదివారం(జూలై 18) నుంచి జింబాబ్వేలో క్వాలిఫియర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హరారే వేదికగా జింబాబ్వే,నేపాల్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ షురూ కానుంది. ఈ అర్హత టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. గ్రూప్ ‘ఎ’లో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ లీగ్ మ్యాచ్‌లు ఆడతాయి. ఫైనల్స్‌కు చేరే రెండు జట్లు అక్టోబర్–నవంబర్లలో భారత్ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇక ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు శనివారం 10 జట్లు కెప్టెన్లు ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోషూట్ హరారేలోని వైల్డ్ ఈజ్ లైఫ్ శాంక్చురీలో జరిగింది. వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ 2023 పూర్తి షెడ్యూల్ 18 జూన్ జింబాబ్వే v నేపాల్, (హరారే స్పోర్ట్స్ క్లబ్) వెస్టిండీస్ v , (తకాషింగా క్రికెట్ క్లబ్) 19 జూన్ శ్రీలంక వర్సెస్ యూఏఈ, (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్) ఐర్లాండ్ వర్సెస్ ఒమన్, (బులవాయో అథ్లెటిక్ క్లబ్) 20 జూన్ జింబాబ్వే వర్సెస్ నెదర్లాండ్స్, (హరారే స్పోర్ట్స్ క్లబ్) నేపాల్ v యూఎస్ఏ, (తకాషింగా క్రికెట్ క్లబ్) 21 జూన్ ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్, (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్) ఒమన్ వర్సెస్, (బులవాయో అథ్లెటిక్ క్లబ్) 22 జూన్ వెస్టిండీస్ వర్సెస్ నేపాల్, (హరారే స్పోర్ట్స్ క్లబ్) నెదర్లాండ్స్ వర్సెస్ యూఎస్ఏ, (తకాషింగా క్రికెట్ క్లబ్) 23 జూన్ శ్రీలంక వర్సెస్ ఒమన్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ స్కాట్లాండ్ v యూఏఈ, బులవాయో అథ్లెటిక్ క్లబ్ 24 జూన్ జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్, హరారే స్పోర్ట్స్ క్లబ్ నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్, తకాషింగా క్రికెట్ క్లబ్ 25 జూన్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ స్కాట్లాండ్ వర్సెస్ ఒమన్, బులవాయో అథ్లెటిక్ క్లబ్ 26 జూన్ జింబాబ్వే వర్సెస్ యూఎస్ఏ , హరారే స్పోర్ట్స్ క్లబ్ వెస్టిండీస్ వర్సెస్ నెదర్లాండ్స్, తకాషింగా క్రికెట్ క్లబ్ 27 జూన్ శ్రీలంక వర్సెస్ స్కాట్లాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ఐర్లాండ్ వర్సెస్ యూఏఈ, బులవాయో అథ్లెటిక్ క్లబ్ 29 జూన్ సూపర్ 6: A2 v B2, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ 30 జూన్ సూపర్ 6: A3 v B1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ప్లేఆఫ్: A5 v B4, తకాషింగా క్రికెట్ క్లబ్ 1 జూలై సూపర్ 6: A1 v B3, హరారే స్పోర్ట్స్ క్లబ్ 2 జూలై సూపర్ 6: A2 v B1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ప్లేఆఫ్: A4 v B5, తకాషింగా క్రికెట్ క్లబ్ 3 జూలై సూపర్ 6: A3 v B2, హరారే స్పోర్ట్స్ క్లబ్ 4 జూలై సూపర్ 6: A2 v B3, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ప్లేఆఫ్: 7వ v 8వ తకాషింగా క్రికెట్ క్లబ్ 5 జూలై సూపర్ సిక్స్: A1 v B2, హరారే స్పోర్ట్స్ క్లబ్ 6 జూలై సూపర్ సిక్స్: A3 v B3, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ప్లేఆఫ్: 9వ v 10వ తకాషింగా క్రికెట్ క్లబ్ 7 జూలై సూపర్ సిక్స్: A1 v B1, హరారే స్పోర్ట్స్ క్లబ్ 9 జూలై ఫైనల్, హరారే స్పోర్ట్స్ క్లబ్ -
వెస్టిండీస్ జట్టు కోచ్‌గా మాజీ కెప్టెన్.. ఎవరంటే?
జింబాబ్వే వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫియర్స్కు ముందు క్రికెట్ వెస్టిండీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విండీస్ అసిస్టెంట్ కోచ్‌గా ఆ జట్టు మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్‌బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. హూపర్ ప్రస్తుతం బార్బడోస్‌లోని వెస్టిండీస్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇన్స్ట్రాక్టర్గా ఉన్నాడు. కాగా హూపర్కు గతంలో కోచ్‌గా, మెంటార్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గతేడాది బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గత కొన్ని సీజన్లగా గయానా అమెజాన్ వారియర్స్ కోచింగ్ స్టాప్‌లో కూడా హూపర్ భాగంగా ఉన్నాడు. ఇక విండీస్ తరపున 329 మ్యాచ్‌లు ఆడిన హూపర్.. 5000 పైగా పరుగులతో పాటు 100 వికెట్లు సాధించాడు. దాదాపు 15 ఏళ్లపాటు కరీబియన్ జట్టుకు హూపర్ సేవలు అందించాడు. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8లో విండీస్ జట్టు లేకపోవడంతో.. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హతసాధించలేదు. ఈ క్రమంలో హోప్ సారధ్యంలోని విండీస్ క్వాలిఫియర్స్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఇక క్వాలిఫియర్స్కు ముందు వెస్టిండీస్.. యూఏఈతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్ -
WC 2023: 44 ఏళ్ల తర్వాత.. తొలిసారి! లంకకు ఏంటీ దుస్థితి? కివీస్ వల్లే..
Sri Lanka Failed To Qualify ICC ODI WC 2023 Directly: 1996 వరల్డ్‌కప్ ఛాంపియన్స్.. 2007, 2011 ప్రపంచకప్ రన్నరప్.. ఇవీ వన్డే క్రికెట్లో శ్రీలంక సాధించిన అద్బుతాలు. అయితే ఇదంతా గతం. కట్‌చేస్తే .. 2023 వన్డే వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించని జట్టుగా లంక అప్రతిష్టను మూటగట్టుకుంది. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, చమిందా వాస్ సహా ఎందరో హేమాహేమీలను అందించిన శ్రీలంక క్రికెట్ ఇప్పుడు కనీసం వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమవ్వడం అందరిని విస్మయపరిచింది. 44 ఏళ్ల తర్వాత లంక మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టడం కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. వరుస ఓటములు లంక అవకాశాలను దెబ్బకొట్టాయి. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అప్పుడలా.. ఇప్పుడిలా అడ్డుకున్న కివీస్ ఇందులో భాగంగా రెండు టెస్టుల్లో పోరాడి ఓడిన లంక జట్టు.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఫలితం నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో కేవలం రెండు వికెట్లతో ఓటమి పాలైన కరుణ రత్నె బృందం.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లిన కివీస్.. తాజాగా వన్డే ప్రపంచకప్‌లో నేరుగా అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసింది. తొలి వన్డేలో 198 పరుగులతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. శుక్రవారం నాటి మూడో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. షనక బృందం అవుట్ కాగా రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 2-0తో సొంతం చేసుకుంది. దీంతో వన్డే సిరీస్ కోల్పోయిన దసున్ షనక బృందం ప్రపంచకప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశం కూడా చేజార్చుకుంది. ఈ క్రమంలో జింబాబ్వేలో జూన్‌లో జరుగనున్న ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. కాగా కివీస్‌తో మూడో వన్డేలో ఓటమితో ఐసీసీ వన్డే సూపర్‌లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంక తొమ్మిదోస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు సౌతాఫ్రికా నుంచి ప్రమాదం పొంచి ఉంది. నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో సత్తా చాటితే ప్రొటిస్ విండీస్‌ను వెనక్కినెట్టి రేసులో మరో ముందడుగు వేస్తుంది. కాగా భారత్ వేదికగా అక్టోబరులో వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్ ఆరంభం కానుంది. చదవండి: IPL 2023 Captains Salaries: సూపర్ క్రేజ్.. సంపాదన కోట్లలో.. ఐపీఎల్ కెప్టెన్ల ‘బలగం’.. బలం! వీరి గురించి తెలుసా? పాపం అతడొక్కడే! -
అమెరికాను గెలిపించిన సాయితేజ రెడ్డి
విండ్‌హోక్ (నమీబియా): వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ టోర్నీలో అమెరికా జట్టు రెండో విజయం నమోదు చేసింది. యూఏఈతో గురువారం జరిగిన మ్యాచ్‌లో అమెరికా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత సంతతికి చెందిన 18 ఏళ్ల సాయితేజ రెడ్డి ముక్కామల (114 బంతుల్లో 120 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో అమెరికాను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఆసిఫ్ ఖాన్ (84 బంతుల్లో 103 పరుగులు, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో ఆకట్టుకోగా.. అర్వింద్( 68 బంతుల్లో 57 పరుగులు) రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో నిసర్గ్ పటేల్, జెస్సీ సింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. అలీ ఖాన్, నెత్రావల్కర్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం అమెరికా 49 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి విజయం సాధించింది. సాయితేజ ముక్కామాలా 120 పరుగులతో అజేయంగా నిలవగా.. మోనాక్ పటేల్ 50 పరుగులతో రాణించాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దికీ మూడు వికెట్లు తీయగా.. మతీఉల్లాఖాన్, అయాన్ అఫ్జల్‌ఖాన్‌లు చెరొక వికెట్ తీశారు. అజేయ సెంచరీతో అమెరికాను గెలిపించిన సాయితేజకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. -
పసికూనల మధ్య పరుగుల వరద.. అనుభవమే గెలిచింది
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నమీబియా, పపువా న్యూ గినియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పేరుకు పసికూనలైనప్పటికి ఆటలో మాత్రం పోటాపోటీని ప్రదర్శించారు. అయితే పపువా కంటే ఎప్పుడో క్రికెట్లో అడుగుపెట్టిన నమీబియానే 48 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కెప్టెన్ గెర్హార్ ఎరాస్మస్ (113 బంతుల్లో 125 పరుగులు), నికో డేవిన్(79 బంతుల్లో 90 పరుగులు), లోప్టీ ఈటన్(59 బంతుల్లో 61 పరుగులు) రాణించారు. పపువా న్యూ గినియా బౌలర్లలో సెమో కామియా ఐదు వికెట్లతో రాణించగా.. కాబువా మోరియా రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 46.2 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. ఆరంభం నుంచి దూకుడుగానే ఆడిన పపువా న్యూ గినియా 282/4తో పటిష్టంగా కనిపించినప్పటికి చివర్లో ఒత్తికి లోనై వికెట్లు చేజార్చుకుంది. చార్ల్స్ అమిని(75 బంతుల్లో 109 పరుగులు, 8 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం సరిపోలేదు. సీస్ బహు(44 బంతుల్లో 54 పరుగులు), కెప్టెన్ అసద్ వాలా(61 బంతుల్లో 57 పరుగులు), కిప్లిన్ డొరిగా(47 పరుగులు) ఆకట్టుకున్నారు. నమీబియా బౌలర్లలో బెర్నాడ్ స్కొల్ట్జ్, రూబెన్ ట్రంపెల్మన్ చెరో మూడు వికెట్లు తీయగా.. గెర్హాడ్ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన గెర్హాడ్ ఎరాస్మస్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. An all-round show from Gerhard Erasmus gives Namibia a win against PNG in a high-scoring game 🙌 Watch the @cricketworldcup Qualifier Play-off LIVE and for FREE on https://t.co/vphAWWBUVe (in select regions) 📺 📝 https://t.co/5KxcH6LbW5 pic.twitter.com/6cj4yP2QNs — ICC Cricket World Cup (@cricketworldcup) March 30, 2023 -
డక్‌వర్త్ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు అర్హత
నేపాల్ క్రికెట్ జట్టుకు డక్‌వర్త్ లూయిస్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలియర్కు అర్హత సాధించాలంటే యూఏఈతో మ్యాచ్‌లో నేపాల్‌కు విజయం తప్పనిసరి అయింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ ఆసిఫ్ ఖాన్ 42 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరు చేసింది. అర్వింద్ 94 పరుగులు చేయగా.. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 63 పరుగులతో రాణించడంతో యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిని అమలు చేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నేపాల్ జట్టు చేయాల్సినదానికన్నా తొమ్మిది పరుగులు ఎక్కువగా చేయడంతో ఆ జట్టు గెలిచినట్లు ప్రకటించారు. బీమ్ షార్కీ 67 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఆరిఫ్ షేక్ 52, గుల్షన్ జా 50 నాటౌట్, కుషాల్ బుర్తెల్ 50 పరుగులు రాణించారు. ఈ మ్యాచ్‌కు ముందు నేపాల్ నాలుగో స్థానంలో ఉండగా.. యూఏఈ ఆరో స్థానంలో ఉంది. ఇప్పటికే స్కాట్లాండ్, ఒమన్‌లు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. తాజాగా డక్‌వర్త్ లుయీస్ పద్దతిలో యూఏఈపై విజయం సాధించిన నేపాల్ మూడో స్థానానికి చేరుకొని మూడో జట్టుగా 2023 క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఇక జింబాబ్వే వేదికగా జూన్‌లో ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీలు జరగనున్నాయి. ఇక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో టీమిండియా అర్హత దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లు తాము ఆడే వన్డే సిరీస్‌ల్లో విజయాల ద్వారా అర్హత సాధించే అవకాశం ఉంది. THE NEPALI RHINOS ARE GOING TO ZIMBABWE! Congratulations to our fearless team on qualifying for the CWC Qualifier, and a great thanks for your love and support! Keep supporting us, and believe that #weCAN!#CWCL2 #NEPvUAE pic.twitter.com/DelaYOttX4 — CAN (@CricketNep) March 16, 2023 చదవండి: క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్ 148 -
పాక్ పనిపట్టి... ఫైనల్‌కు
⇒టైటిల్ పోరుకు భారత మహిళల జట్టు ⇒పాకిస్తాన్‌పై ఏడు వికెట్లతో గెలుపు ⇒స్పిన్నర్ ఏక్తా (10–7–8–5) అద్భుత ప్రదర్శన ⇒మంగళవారం దక్షిణాఫ్రికాతో తుది సమరం కొలంబో: ఫేవరెట్ హోదాతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు అదే స్థాయిలో ప్రదర్శన చేస్తూ... ఐసీసీ ప్రపంచకప్ వన్డే క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. లీగ్ దశలో నాలుగు విజయాలు, సూపర్ సిక్స్‌లో మూడు విజయాలు సాధించిన భారత్ అజేయ రికార్డుతో ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. సూపర్ సిక్స్ దశ తర్వాత తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్ (10 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు), శ్రీలంక (6 పాయింట్లు), పాకిస్తాన్ (4 పాయింట్లు) జట్లు జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. ఏక్తా మాయాజాలం... టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ పాకిస్తాన్‌కు బ్యాటింగ్ అప్పగించగా... ఆ జట్టు 43.4 ఓవర్లలో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ ఏక్తా బిష్త్ కళ్లు చెదిరే బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. 31 ఏళ్ల ఏక్తా 10 ఓవర్లలో 7 మెయిడిన్లు వేసి కేవలం 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. శిఖా పాండే రెండు వికెట్లు తీయగా... దీప్తి శర్మ, దేవిక వైద్య, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు ఒక్కో వికెట్ లభించింది. పాక్ జట్టులో ఎక్స్‌ట్రాలే (24) అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇద్దరు బ్యాట్స్‌విమెన్ అయేషా జఫర్ (19; 3 ఫోర్లు), బిస్మా మారూఫ్ (13; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగతా ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం భారత్ 22.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 70 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. దీప్తి శర్మ (29 నాటౌట్; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (24; 2 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు పాకిస్తాన్‌తో ఆడిన తొమ్మిది అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లోనూ భారత్‌నే విజయం వరించడం విశేషం. ఇతర సూపర్ సిక్స్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీలంక 42 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై, దక్షిణాఫ్రికా 36 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచాయి.