అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు.. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే! | Charlie Cassell Become First Player In History To Rare Feat On ODI Debut, Breaks Rabada World Record | Sakshi
Sakshi News home page

అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు.. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే!

Published Mon, Jul 22 2024 8:39 PM | Last Updated on Tue, Jul 23 2024 10:56 AM

Charlie Cassell Become First Player In History To Rare Feat On ODI Debut

స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్ స‌రి కొత్త చ‌రిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కాసెల్ రికార్డులకెక్కాడు. సోమవారం ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ లీగ్ 2లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాసెల్ అరంగేట్రం చేశాడు.

 ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 21 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబడా పేరిట ఉండేది. 

2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్‌ రికార్డును కాస్సెల్‌ బ్రేక్‌ చేశాడు. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 

తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్‌ రికార్డును కాస్సెల్‌ బ్రేక్‌ చేశాడు. అదే విధంగా మరో వరల్డ్‌రికార్డును కూడా అతడు నమోదు చేశాడు. అరంగేట్రంలో తొలి రెండు బంతుల్లోనే వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా కాస్సెల్‌ నిలిచాడు. 

తను వేసిన మొదటి ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో ఒమన్‌ బ్యాటర్లు జీషన్ మస్కూద్ అయాన్ ఖాన్‌లను  ఔట్‌ చేసిన కాసెల్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.  53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్‌ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేయలేకపోయాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన  ఒమన్‌.. కాసెల్ దాటికి  కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్‌ 2 వికెట్లు కోల్పోయి చేధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement