ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నమీబియా, పపువా న్యూ గినియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పేరుకు పసికూనలైనప్పటికి ఆటలో మాత్రం పోటాపోటీని ప్రదర్శించారు. అయితే పపువా కంటే ఎప్పుడో క్రికెట్‌లో అడుగుపెట్టిన నమీబియానే 48 పరుగులతో విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కెప్టెన్ గెర్హార్ ఎరాస్మస్ (113 బంతుల్లో 125 పరుగులు), నికో డేవిన్(79 బంతుల్లో 90 పరుగులు), లోప్టీ ఈటన్(59 బంతుల్లో 61 పరుగులు) రాణించారు. పపువా న్యూ గినియా బౌలర్లలో సెమో కామియా ఐదు వికెట్లతో రాణించగా.. కాబువా మోరియా రెండు వికెట్లు తీశాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 46.2 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. ఆరంభం నుంచి దూకుడుగానే ఆడిన పపువా న్యూ గినియా 282/4తో పటిష్టంగా కనిపించినప్పటికి చివర్లో ఒత్తికి లోనై వికెట్లు చేజార్చుకుంది. చార్ల్స్ అమిని(75 బంతుల్లో 109 పరుగులు, 8 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం సరిపోలేదు. సీస్ బహు(44 బంతుల్లో 54 పరుగులు), కెప్టెన్ అసద్ వాలా(61 బంతుల్లో 57 పరుగులు), కిప్లిన్ డొరిగా(47 పరుగులు) ఆకట్టుకున్నారు. నమీబియా బౌలర్లలో బెర్నాడ్ స్కొల్ట్జ్, రూబెన్ ట్రంపెల్‌మన్ చెరో మూడు వికెట్లు తీయగా.. గెర్హాడ్ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన గెర్హాడ్ ఎరాస్మస్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
An all-round show from Gerhard Erasmus gives Namibia a win against PNG in a high-scoring game 🙌
— ICC Cricket World Cup (@cricketworldcup) March 30, 2023
Watch the @cricketworldcup Qualifier Play-off LIVE and for FREE on https://t.co/vphAWWBUVe (in select regions) 📺
📝 https://t.co/5KxcH6LbW5 pic.twitter.com/6cj4yP2QNs
Comments
Please login to add a commentAdd a comment