
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)ఆతిథ్య జట్టు జింబాబ్వే ఎదురులేకుండా దూసుకెళుతుంది. టోర్నీలో జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సికందర్ రజా (54 బంతుల్లోనే 102 పరుగులు) వీరోచిత సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో వన్డేల్లో జింబాబ్వే తరపున వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్‌గా సికందర్ రజా గుర్తింపు పొందాడు.
కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. విక్రమ్‌జిత్ సింగ్(88 పరుగులు), మాక్స్ ఒడౌడ్(59 పరుగులు), స్కాట్ ఎడ్వర్డ్స్(83 పరుగులు) రాణించగా.. సికందర్ రజా 55 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం 316 టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 40.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. క్రెయిగ్ ఇర్విన్(50 పరుగులు), సీన్ విలియమ్స్(91 పరుగులు) రాణించగా.. సికందర్ రజా(54 బంతుల్లో 102 నాటౌట్, ఆరు ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు.
Hosts Zimbabwe make it two wins out of two after Sikandar Raza's heroics ✌️
— ICC Cricket World Cup (@cricketworldcup) June 20, 2023
📝: #ZIMvNED: https://t.co/6sP9VYrxb0 | #CWC23 pic.twitter.com/u52nPJgmF6
Comments
Please login to add a commentAdd a comment