CWC Qualifiers 2023: Zimbabwe Beat USA By 304 Runs, 2nd Biggest Win After India - Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత..

Published Mon, Jun 26 2023 7:06 PM | Last Updated on Mon, Jun 26 2023 7:28 PM

CWC Qualifiers: Zimbabwe Beat USA By 304 Runs 2nd Biggest Win After India - Sakshi

ICC Cricket World Cup Qualifiers 2023: ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసింది. హరారే వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో యూఎస్‌ఏను ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన జట్టుగా టీమిండియా తర్వాతి స్థానంలో నిలిచింది.

ఇప్పటికే సూపర్‌ సిక్సెస్‌లో
సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 క్వాలిఫయర్స్‌లో ఇప్పటికే సూపర్‌ సిక్సెస్‌కు అర్హత సాధించిన జింబాబ్వే జూన్‌ 26న యూఎస్‌ఏతో నామమాత్రపు మ్యాచ్‌లో తలపడింది. టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు స్కోరు చేసింది.

కెప్టెన్‌ ఊచకోత.. ఏకంగా
వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ 101 బంతుల్లో ఏకంగా 21 ఫోర్లు, 5 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. 174 పరుగులు సాధించాడు. ఓపెనర్‌ గుంబీ 78 పరుగులు సాధించగా.. సికందర్‌ రజా 48, రియాన్‌ బర్ల్‌ 47 పరుగులతో రాణించారు.

మరీ దారుణం
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన యూఎస్‌ఏ 104 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్ల సమిష్టి ప్రదర్శన కారణంగా 25.1 ఓవర్లకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ బ్యాటర్లు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0.6,9,8,13,0,24,2,21,6,0.

బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో.. ముఖ్యంగా టాపార్డర్‌ దారుణ వైఫల్యం కారణంగా యూఎస్‌ఏకు 304 పరుగుల భారీ తేడాతో ఓటమి తప్పలేదు. ఇక కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన జింబాబ్వే సారథి సీన్‌ విలియమ్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

టీమిండియా తర్వాతి స్థానం జింబాబ్వేదే
యూఎస్‌ఏపై సంచలన విజయం నమోదు చేసిన జింబాబ్వే వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. మేటి జట్లను వెనక్కి నెట్టి.. టీమిండియా తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది.

వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయాలివే
►2023- తిరువనంతపురంలో శ్రీలంక మీద భారత్‌- 317 పరుగులు
►2023- హరారేలో యూఎస్‌ఏ మీద జింబాబ్వే- 304 పరుగులు
►2008- అబెర్డీన్‌లో ఐర్లాండ్‌ మీద న్యూజిలాండ్‌- 290 పరుగులు
►2015- పెర్త్‌లో అఫ్గనిస్తాన్‌ మీద ఆస్ట్రేలియా- 275 పరుగులు
►2010- బెనోనిలో జింబాబ్వే మీద సౌతాఫ్రికా-272 పరుగుల తేడాతో విజయం సాధించాయి.

చదవండి: ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్‌ కూల్‌ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా..
ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement