
PC: BCCI/IPL.com
ఎంఎస్ ధోని.. 689 రోజుల తర్వాత తిరిగి కెప్టెన్‌గా మైదానంలో అడుగు పెట్టాడు. ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోని వ్యహరిస్తున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడంతో ధోని తిరిగి సీఎస్‌కే బాధ్యతలు చేపట్టాడు.
ఈ క్రమంలో 43 ఏళ్ల ధోని పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మొదటి అన్‌క్యాప్డ్ కెప్టెన్‌గా ధోని రికార్డులెక్కాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడినైనా అనక్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించవచ్చు.
ధోని 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలోనే ధోనిని అన్‌క్యాప్డ్ కోటాలో రూ. 4 కోట్లు వెచ్చించి చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ధోనితో పాటు టీమిండియా వెటరన్ ప్లేయర్లు సందీప్ శర్మ, మోహిత్ శర్మ కూడా రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌గా ఆడుతున్నారు. అదేవిధంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో కెప్టెన్‌గా ఎంపికైన అతి పెద్ద వయష్కుడిగా ధోని నిలిచాడు.
కాగా ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా ధోని తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023లో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను అందుకుంది. అంతేకాకుండా పది సార్లు ఫైనల్స్‌కు కూడా మిస్టర్ కూల్ చేర్చాడు.
చదవండి: PSL 2025: వరుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్