విండ్‌హోక్ (నమీబియా): వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ టోర్నీలో అమెరికా జట్టు రెండో విజయం నమోదు చేసింది. యూఏఈతో గురువారం జరిగిన మ్యాచ్‌లో అమెరికా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత సంతతికి చెందిన 18 ఏళ్ల సాయితేజ రెడ్డి ముక్కామల (114 బంతుల్లో 120 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో అమెరికాను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది.
ఆసిఫ్ ఖాన్ (84 బంతుల్లో 103 పరుగులు, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో ఆకట్టుకోగా.. అర్వింద్( 68 బంతుల్లో 57 పరుగులు) రాణించారు. యూఎస్‌ఏ బౌలర్లలో నిసర్గ్ పటేల్, జెస్సీ సింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. అలీ ఖాన్, నెత్రావల్కర్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం అమెరికా 49 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి విజయం సాధించింది.
సాయితేజ ముక్కామాలా 120 పరుగులతో అజేయంగా నిలవగా.. మోనాక్ పటేల్ 50 పరుగులతో రాణించాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దికీ మూడు వికెట్లు తీయగా.. మతీఉల్లాఖాన్, అయాన్ అఫ్జల్‌ఖాన్‌లు చెరొక వికెట్ తీశారు. అజేయ సెంచరీతో అమెరికాను గెలిపించిన సాయితేజకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment