
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)లో నేపాల్ బోణీ కొట్టింది. హరారే వేదికగా యూఎస్‌ఏ(అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 43 ఓవర్లలో ఛేదించింది.
నేపాల్ బ్యాటర్లలో భీమ్ షాక్రి(77) పరుగులతో అజేయంగా నిలవగా.. కుశాల్ భుర్టెల్(39), దీపేంద్ర సింగ్(39) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో టేలర్, ఎన్ పటేట్, సౌరభ్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. నేపాల్ బౌలర్లలో నిప్పులు చేరగడంతో 207 పరుగులకే ఆలౌటైంది.
యూఎస్ఏ బ్యాటర్లలో షాయన్ జహంగీర్(100 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక నేపాల్ బౌలర్లలో కరణ్ 4 వికెట్లతో యూఏస్‌ఏను దెబ్బతీయగా.. గుల్సాన్ ఝా మూడు వికెట్లు సాధించాడు. నేపాల్ తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం వెస్టిండీస్‌తో తలపడనుండగా.. యూఎస్‌ఏ నెదర్లాండ్స్‌తో ఆడనుంది.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. శుబ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్! రుత్‌రాజ్ రీ ఎంట్రీ