NEPAL CRICKET TEAM
-
నేపాల్‌పై ఘన విజయం.. సూపర్‌కు 8 చేరిన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూపు-డి బంగ్లాదేశ్ తమ సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూపు-డి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ బౌలర్లు సోమ్‌పాల్ కామి, దీపేంద్ర సింగ్ ఐరీ, రోహిత్ పౌడౌల్, లమచానే తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్(17) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అదరగొట్టిన బంగ్లా బౌలర్లు..బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. బంగ్లా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 85 పరుగులకే కుప్పకూలింది.బంగ్లా యువ పేసర్ టాంజిమ్ హసన్ షకీబ్ 4 వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ముస్తఫిజుర్ రెహ్మన్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు. నేపాల్ బ్యాటర్లలో కుశాల్ మల్లా(27) పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక సూపర్-8కు అర్హత సాధించిన బంగ్లాదేశ్ గ్రూపు-1లో ఆస్ట్రేలియా, భారత్, అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. -
T20 WC 2024: నేపాల్ జట్టుకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్-2024లో నేపాల్ జట్టు ఆడే చివరి రెండు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే అందుబాటులోకి రానున్నాడు. గతంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఎనిమిదేళ్ల జైలు శిక్షకు గురై... ఆ తర్వాత ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి విముక్తి పొందిన లమిచానేకు అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది.దాంతో అతను అమెరికా వేదికగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నేపాల్ తమ చివరి రెండు మ్యాచ్‌లను వెస్టిండీస్ వేదికగా ఆడనుంది. ఈనెల 15న దక్షిణాఫ్రికాతో, 17న బంగ్లాదేశ్‌తో కింగ్స్టౌన్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సందీప్ లమిచానే ఇప్పటికే వెస్టిండీస్‌కు చేరుకున్నాడు.కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందీప్ లమిచానే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్ స్పిన్ బౌలర్.. నేపాల్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 52 టీ20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 51 వన్డేలు ఆడి 112 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూప్-డిలో ఉన్న నేపాల్ నెదర్లాండ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడింది. ఇందులో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తదుపరి జూన్ 12న శ్రీలంకతో ఫ్లోరిడా వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా సందీప్ దూరంగా ఉండనున్నాడు.టీ20 ప్రపంచకప్-2024 కోసం నేపాల్ ప్రకటించిన జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.సందీప్ లమిచానే -
చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
టీ20 వరల్డ్‌కప్-2024ను నేపాల్ జట్టు ఓటమితో ఆరంభించింది. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో నేపాల్ పరాజయం పాలైనప్పటకి ఆ జట్టు కెప్టెన్ రోహిత్ పాడెల్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఓ జట్టుకు నాయకత్వం వహించిన పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రోహిత్ పాడెల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 276 రోజుల వయస్సులో నేపాల్ జట్టు కెప్టెన్‌గా పాడెల్ వ్యవహరిస్తున్నాడు. ఇంతకముందు ఈ రికార్డు జింబాబ్వే మాజీ కెప్టెన్ ప్రోస్పర్ ఉత్సేయ పేరిట ఉండేది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో 21 ఏళ్ల 354 రోజుల వయస్సులో జింబాబ్వే జట్టుకు ప్రోస్పర్ ఉత్సేయ సారథ్యం వహించాడు. తాజా మ్యాచ్‌తో ఉత్సేయ ఆల్‌టైమ్ రికార్డును పాడెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆడిప అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా పాడెల్ నిలిచాడు. ఇప్పటివరకు రికార్డు రషీద్ ఖాన్ (22) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రషీద్ ఖాన్ రికార్డును పాడెల్ బద్దలు కొట్టాడు. -
నేపాల్ క్రికెట్‌కు బీసీసీఐ చేయూత.. భారత్‌లో ట్రై సిరీస్ నిర్వహణ
నేపాల్ క్రికెట్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చేయూతనందించేందుకు ముందుకు వచ్చింది. ఆర్దికంగా వెనుకపడిన నేపాల్ క్రికెట్ బోర్డుకు లబ్ది చేకూరే విధంగా ఆ దేశ క్రికెట్ జట్టుతో ట్రైయాంగులర్ సిరీస్‌ను ప్లాన్ చేసింది. భారత దేశవాలీ ఛాంపియన్ జట్లైన్ బరోడా, గుజరాత్ జట్లు మార్చి 31-ఏప్రిల్ 7 మధ్యలో నేపాల్ టీమ్‌తో ట్రై సిరీస్ ఆడనున్నాయి. ఈ టోర్నీ మొత్తం గుజరాత్‌లోని వాపి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఈ ట్రై సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను నేపాల్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఫిబ్రవరి 19) విడుదల చేసింది. అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లతో టోర్నీమెంట్ ఆడటం ద్వారా నేపాల్ జట్టుకు అంతర్జాతీయ అనుభవం వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్ 2024 నేపథ్యంలో ఈ టోర్నీ నేపాల్ జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రన్నరప్ అయిన బరోడా టీమ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సారథ్యం వహించనుండగా.. గుజరాత్ జట్టులో పియూష్ చావ్లా, రవి బిష్ణోయ్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. ఈ ట్రై సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. నేపాల్ జట్టు మార్చి 31న గుజరాత్‌తో, ఏప్రిల్ 2న బరోడాతో, ఏప్రిల్ 3న మళ్లీ గుజరాత్‌తో, ఏప్రిల్ 5న మరోసారి బరోడాతో తలపడనుంది. ఏప్రిల్ 7న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా, నేపాల్ జట్టు ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన నేపాల్.. టీ20 వరల్డ్ కప్‌కి అర్హత
నేపాల్ క్రికెట్ జట్ట సరికొత్త చరిత్ర సృష్టించింది. యూఎస్ఎ, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2024కు నేపాల్ అర్హత సాధించింది. ఆసియా క్వాలిఫయర్స్ సెమీఫైనల్-2 లో యూఏఈను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన నేపాల్.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయింది. అంతకుముందు 2014 టీ20 వరల్డ్‌కప్‌లో నేపాల్ మొదటి సారి భాగమైంది. 135 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 17.1 ఓవర్లలో ఛేదించింది. నేపాల్ బ్యాటర్లలో ఓపెనర్ ఆసిఫ్ షేక్(64 నాటౌట్) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ పౌడెల్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. యూఏఈ బ్యాటర్లలో అరవింద్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో కుశాల్ మల్లా మూడు వికెట్లతో అదరగొట్టగా.. లమచానే రెండు, కామి ఒక్క వికెట్ సాధించారు. కాగా నేపాల్‌తో పాటు ఒమన్ కూడా పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కిర్తాపూర్ వేదికగా జరిగిన బెహ్రయిన్తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందిన ఒమన్ .. వరల్డ్‌కప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 20 జట్లు బరిలోకి.. 2024 టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ సారి ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. టీ20 వరల్డ్‌కప్ టాప్-8లో నిలిచిన జట్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించాయి. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం 9, 10 స్ధానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా డైరక్ట్‌గా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. క్వాలిఫయర్స్ ద్వారా ఇప్పటికే ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా అర్హత సాధించగా.. తాజాగా ఈ జాబితాలో నేపాల్, ఒమన్ చేరాయి. చదవండి: పంట పొలాల్లో పరుగులు.. వివాదాలు చుట్టుముట్టినా.. ఆటనే నమ్ముకుని! వరల్డ్‌కప్ చరిత్రలో ఇలా.. -
టీ20ల్లో నేపాల్ బౌలర్ అత్యుత్తమ గణాంకాలు
ఏషియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ రికార్డులకు అడ్డాగా మారింది. ఈ పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డు బద్దలు కొడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నేపాల్ జట్టు ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో రికార్డుల రారాజుగా మారింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు టీ20ల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డులతో పాటు పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. తాజాగా మాల్దీవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్ అభానష్ బొహారా టీ20ల్లో ఏడో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 3.4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో నేపాల్ తరఫున ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఈ విభాగానికి సంబంధించి మలేషియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ పేరిట అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి. ఇదే ఏడాది చైనాతో జరిగిన మ్యాచ్‌లో ఇద్రుస్ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇద్రుస్కు ముందు 7 వికెట్లు తీయలేదు. ఇదిలా ఉంటే, ఏషియన్ గేమ్స్‌లో మాల్దీవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 138 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. మాల్దీవ్స్ 19.4 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ 27 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేయగా.. గత మ్యాచ్‌లో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన కుషాల్ మల్లా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడాడు. మాల్దీవ్స్ బౌలర్లలో నజ్వాన్ ఇస్మాయిల్ (4-0-17-3) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన మాల్దీవ్స్ అభినాశ్ బొహార ధాటికి 74 పరుగులకు కుప్పకూలింది. మాల్దీవ్స్ ఇన్నింగ్స్‌లో ఘనీ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ పోటీల్లో భారత్ మ్యాచ్ అక్టోబర్ 3న జరుగనుంది. -
కోహ్లి, రోహిత్‌లను అడ్డుకుంటాము.. భారత్‌కు పోటీ ఇస్తాం: నేపాల్ కెప్టెన్
ఆసియాకప్‌లో తొలిసారి ఆడుతున్న నేపాల్ మరో కీలకపోరుకు సిద్దమైంది. సోమవారం క్యాండీ వేదికగా టీమిండియాతో నేపాల్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ విలేకురల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్ కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నామని తెలపాడు. కాగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్ భారీ ఓటమి చవిచూసింది. దీంతో భారత్ జరగనున్న మ్యాచ్ నేపాల్‌కు డూ ఆర్‌డైగా మారింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ ఓటమి పాలైతే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టనుంది. "ప్రపంచక్రికెట్లో అత్యత్తమ జట్లలో భారత్ ఒకటి. అటువంటి జట్టుతో మాకు ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌తో తలపడేందుకు మేము అతృతగా ఎదురుచూస్తున్నాము. గత మూడేళ్ల నుంచి మేము తీవ్రంగా శ్రమిస్తున్నాము. అందుకే ఇటువంటి మెగా టోర్నీలో భాగమయ్యే అవకాశం లభించింది. మా కంటే ముందు తరం క్రికెటర్లు ఇటువంటి టోర్నీల్లో ఆడేందుకు చాలా ప్రయత్నించారు. కానీ వారు అది సాధించలేకపోయారు. కాబట్టి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకంటాము. ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టులో స్టార్ ఆటగాళ్లగా కొనసాగుతున్నారు. వారిని ఎదుర్కోవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసాము. విరాట్ మా అందరికి ఆదర్శమని" ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరేన్స్లో రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్.. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. తొలి కెప్టెన్‌గా! కోహ్లి రికార్డు బద్దలు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి తన సత్తాను ప్రపంచానికి చూపించాడు. ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజం విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. బాబర్‌కు ఇది తన కెరీర్లో 19వ వన్డే సెంచరీ. ఈ మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన బాబర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 238 పరుగుల తేడాతో పాకిస్తాన్ భారీ విజయం సాధించింది. పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న భారత్‌తో తలపడనుంది. బాబర్ సాధించిన రికార్డులు ఇవే.. ►వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. బాబర్ ఈ ఫీట్‌ను కేవలం 102 ఇన్నింగ్స్‌లు మాత్రమే అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు సౌతాఫ్రికా లెజెండ్ హషీమ్ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌ల్లో) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆమ్లా రికార్డును ఆజం బ్రేక్ చేశాడు. ►అదే విధంగా ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన కెప్టెన్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(136) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో 151 పరుగులు చేసిన ఆజం.. కింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ►అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(5238), ఆసీస్ మాజీ క్రికెటర్ మార్టిన్(5346)ను బాబర్ అధిగమించాడు. ఇప్పటివరకు 102 ఇన్నింగ్స్‌లలో ఆజం 5353 పరుగులు చేశాడు. చదవండి: AUS vs SA 1st T20I: మిచెల్ మార్ష్ ఊచకోత.. డేవిడ్ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు -
తొలిసారి ఆసియాకప్‌కు.. నేపాల్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు నేపాల్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2023 ఫైనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టును ఓడించిన నేపాల్.. ఈ ఏడాది ఆసియాకప్‌కు క్వాలిఫై అయింది. భారత్, పాకిస్తాన్ ఉన్న గ్రూపు-ఏలో నేపాల్ చేరింది. నేపాల్ జట్టు ప్రకటన.. ఇక ఈ మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నేపాల్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ పాడెల్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో సందీప్ లామిచానే, కుశాల్ మల్లా వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో నేపాల్ పెద్దగా రాణించలేకపోయింది. పాకిస్తాన్-ఏ, భారత్-ఏ వంటి జట్ల చేతిలో నేపాల్ ఓటమి పాలైంది. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై మాత్రం అద్భుత విజయం సాధించింది. ఇక ఆసియాకప్-2023లో నేపాల్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఆసియా కప్ 2023కు నేపాల్ జట్టు - రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, కుసల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, భీమ్ షర్కీ, కుశాల్ మల్లా, డి.ఎస్. ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కె.సి., గుల్షన్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, కె. ప్రతీస్ జి.సి. మహతో, సందీప్ జోరా, అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్ చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ! -
ICC CWC Qualifier 2023: అమెరికాకు మరో బిగ్ షాక్.. నేపాల్ సంచలన విజయం
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)లో నేపాల్ బోణీ కొట్టింది. హరారే వేదికగా యూఎస్ఏ(అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 43 ఓవర్లలో ఛేదించింది. నేపాల్ బ్యాటర్లలో భీమ్ షాక్రి(77) పరుగులతో అజేయంగా నిలవగా.. కుశాల్ భుర్టెల్(39), దీపేంద్ర సింగ్(39) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో టేలర్, ఎన్ పటేట్, సౌరభ్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. నేపాల్ బౌలర్లలో నిప్పులు చేరగడంతో 207 పరుగులకే ఆలౌటైంది. యూఎస్ఏ బ్యాటర్లలో షాయన్ జహంగీర్(100 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక నేపాల్ బౌలర్లలో కరణ్ 4 వికెట్లతో యూఏస్ఏను దెబ్బతీయగా.. గుల్సాన్ ఝా మూడు వికెట్లు సాధించాడు. నేపాల్ తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం వెస్టిండీస్‌తో తలపడనుండగా.. యూఎస్ఏ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. శుబ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్! రుత్‌రాజ్ రీ ఎంట్రీ -
ఇది కదా క్రికెటింగ్ స్పిరిట్ అంటే.. అవకాశం దొరికినా..!
నేపాల్ క్రికెటర్ ఆసిఫ్ షేక్ 2022 సంవత్సరానికి గాను క్రిస్టఫర్ జెన్కిన్స్ మార్టిన్ (CJM) స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) 2023 మార్చి 21న ప్రకటించింది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఆసిఫ్ 2022 ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆండీ మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా ఔట్ చేయకుండా వదిలిపెట్టడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. తన చర్య వల్ల జెంటిల్మెన్ గేమ్ యొక్క ప్రతిష్ఠను పెంచినందుకు గాను ఆసిఫ్‌కు ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కూడా దక్కింది. Nepal's Aasif Sheikh has won a Spirit of Cricket Award for this special moment ❤️ pic.twitter.com/FrkBT1y3jC — England's Barmy Army (@TheBarmyArmy) March 20, 2023 అసలేం జరిగిందంటే.. 2022 ఫిబ్రవరిలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కమల్ సింగ్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని ఐర్లాండ్ బ్యాటర్ మార్క్ అదైర్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అదైర్ కొట్టిన షాట్ అతనికి కాళ్లకే తాకి లెగ్‌సైడ్ దిశగా వెళ్లింది. బౌలర్ బంతి కోసం పరుగు పెట్టే క్రమంలో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌ను ఢీకొట్టాడు. దీంతో అతను పిచ్ మధ్యలో కింద పడిపోయాడు. మెక్‌బ్రైన్ లేచి పరుగు పూర్తి చేసే లోపు బౌలర్ బంతిని వికెట్‌కీపర్ ఆసిఫ్‌కు చేరవేయగా, అతను రనౌట్ చేయడమే తరువాయి అని అంతా అనుకున్నారు. అయితే, తమ బౌలర్ ఢీకొట్టడం వల్లనే మెక్‌బ్రైన్ కిందపడి రనౌటయ్యే ప్రమాదంలో పడ్డాడని భావించిన ఆసిఫ్.. అతన్ని రనౌట్ చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో మెక్‌బ్రైన్ విజయవంతంగా పరుగు పూర్తి చేయగలిగాడు. ఆ సమయంలో ఆసిఫ్ చూపిన క్రీడాస్పూర్తికి యావత్ క్రీడాప్రపంచం జేజేలు పలికింది. క్రికెట్ విశ్లేషకులు ఆసిఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ నిర్ణీత ఓవరల్లో 127 చేయగా.. ఛేదనలో నేపాల్ 111 పరుగులకు మాత్రమే పరిమితమై 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ.. మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేసి ఉంటే తాము గెలిచే వాళ్లమో లేదో తెలీదు, అతన్ని ఔట్ చేసుంటే మాత్రం క్రీడాస్పూర్తి అనే మాటకు అర్ధం లేకుండా పోయేది అంటూ మెచ్యూర్డ్ కామెంట్స్ చేశాడు. కాగా, సీజేఎమ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కోసం ఇంగ్లండ్ పరిమిత ఓవర్లు, టెస్ట్ జట్ల కెప్టెన్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ కూడా పోటీపడ్డారు. 2022 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని మాథ్యూ వేడ్ ఔట్ అయినప్పటికీ బట్లర్ అప్పీల్ చేయకుండా వదిలిపెట్టాడు. బెన్ స్టోక్స్ విషయానికొస్తే.. పాక్‌పై సిరీస్ విక్టరీ అనంతరం స్టోక్స్.. యువ ఆటగాడు రెహాన్ అహ్మద్‌కు ట్రోఫీ అందించి క్రీడాస్పూర్తిని చాటాడు. అలాగే ఈ సిరీస్ ఆడటం ద్వారా తనకు వచ్చే పారితోషికం మొత్తాన్ని పాక్‌లో వరద బాధితులకు అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. -
డక్‌వర్త్ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు అర్హత
నేపాల్ క్రికెట్ జట్టుకు డక్‌వర్త్ లూయిస్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలియర్కు అర్హత సాధించాలంటే యూఏఈతో మ్యాచ్‌లో నేపాల్‌కు విజయం తప్పనిసరి అయింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ ఆసిఫ్ ఖాన్ 42 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరు చేసింది. అర్వింద్ 94 పరుగులు చేయగా.. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 63 పరుగులతో రాణించడంతో యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిని అమలు చేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నేపాల్ జట్టు చేయాల్సినదానికన్నా తొమ్మిది పరుగులు ఎక్కువగా చేయడంతో ఆ జట్టు గెలిచినట్లు ప్రకటించారు. బీమ్ షార్కీ 67 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఆరిఫ్ షేక్ 52, గుల్షన్ జా 50 నాటౌట్, కుషాల్ బుర్తెల్ 50 పరుగులు రాణించారు. ఈ మ్యాచ్‌కు ముందు నేపాల్ నాలుగో స్థానంలో ఉండగా.. యూఏఈ ఆరో స్థానంలో ఉంది. ఇప్పటికే స్కాట్లాండ్, ఒమన్‌లు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. తాజాగా డక్‌వర్త్ లుయీస్ పద్దతిలో యూఏఈపై విజయం సాధించిన నేపాల్ మూడో స్థానానికి చేరుకొని మూడో జట్టుగా 2023 క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఇక జింబాబ్వే వేదికగా జూన్‌లో ఐసీసీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీలు జరగనున్నాయి. ఇక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో టీమిండియా అర్హత దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లు తాము ఆడే వన్డే సిరీస్‌ల్లో విజయాల ద్వారా అర్హత సాధించే అవకాశం ఉంది. THE NEPALI RHINOS ARE GOING TO ZIMBABWE! Congratulations to our fearless team on qualifying for the CWC Qualifier, and a great thanks for your love and support! Keep supporting us, and believe that #weCAN!#CWCL2 #NEPvUAE pic.twitter.com/DelaYOttX4 — CAN (@CricketNep) March 16, 2023 చదవండి: క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్ 148 -
ఇదేమి సెలబ్రేషన్‌రా నాయనా... ఇప్పటివరకు చూసి ఉండరు! వీడియో వైరల్!
వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫియర్స్ ఆశలను నేపాల్ జట్టు సజీవంగా నిలుపుకుంది. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా యూఏఈతో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. నేపాల్ బ్యాటర్లలో భీమ్ షార్కి(70), ఆరిఫ్ షేక్(43) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జూనైడ్ సిద్దూఖి మూడు వికెట్లు, ముస్తఫా, లాక్రా తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 45 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లో ఆసిఫ్ ఖాన్(82), ఆర్యన్ లాక్రా(50) పరుగులతో రాణించనప్పటికీ.. ఓటమి మాత్రం యూఏఈ వెంట నిలిచింది. ఇక నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, కామి తలా మూడు వికెట్లతో యుఏఈ పతనాన్ని శాసించారు. దీపేంద్ర సింగ్ స్పెషల్ సెలబ్రేషన్స్... నేపాల్ విజయంలో ఆ జట్టు స్పిన్నర్ దీపేంద్ర సింగ్ కీలక పాత్ర పోషించాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన దీపేంద్ర సింగ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఓ స్పెషల్ సెలబ్రేషన్స్‌తో అందరని ఆశ్చర్యపరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్ 42 ఓవర్ వేసిన దీపేంద్ర.. అద్భుతంగా ఆడుతున్న ఆసిఫ్ ఖాన్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో నేపాల్ జట్టు సంబురాల్లో మునిగి తేలిపోయింది. దీపేంద్ర సింగ్ అయితే గ్రౌండ్లో పై ఫ్లిప్స్ (గెంతులు) వేసి వికెట్ సెల్‌బ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
Nepal Head Coach: నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం సోషల్‌మీడియా వేదికగా ప్రకటిచింది. మాంటీ దేశాయ్ గతంలో ఐపీఎల్లో పాటు వెస్టిండీస్ పురుషల క్రికెట్ జట్టుకు కూడా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. "భారత్ మాజీ క్రికెటర్, చాలా అనుభవజ్ఞుడైన మాంటి దేశాయ్‌ను నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించడం జరిగింది. నేపాల్ జట్టును ఉన్నతమైన జట్టుగా తీర్చుదిద్దుతారని ఆశిస్తున్నాము" అని క్రికెట్ నేపాల్ ట్విటర్లో పేర్కొంది. కాగా గతేడాది నేపాల్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మనోజ్ ప్రభాకర్ స్థానాన్ని దేశాయ్ భర్తీ చేయనున్నాడు. ఇక స్వదేశంలో ఫిబ్రవరి 14 నుంచి నమీబియా,స్కాట్లాండ్తో జరగనున్న ట్రై సిరీస్‌లో నేపాల్ తలపడనుంది. ఈ సిరీస్ నుంచి నేపాల్ హెడ్‌కోచ్‌గా మాంటి దేశాయ్ ప్రయాణం ప్రారంభం కానుంది. Mrugng (Monty) Desai, a very experienced high performance coach from India, has been appointed as the head coach of the Nepal National Cricket Team. pic.twitter.com/oEHBQ69yQn — CAN (@CricketNep) February 6, 2023 చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ -
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ నేపాల్ జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు తరఫున 1984 నుంచి 1996 మధ్య కాలంలో 39 టెస్టులు, 130 వన్డేలు ఆడిన ప్రభాకర్ గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. 2016లో అఫ్గానిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. నేపాల్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారని.. తన శిక్షణతో వారిని ఉన్నతస్థితికి తీసుకెళ్తానని ప్రభాకర్ అన్నాడు. -
నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మనోజ్ ప్రభాకర్ గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అతడు రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ వంటి రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2016 సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఇక 39 టెస్టులు, 130 వన్డేల్లో భారత్ తరపున ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించాడు.1980 నుంచి 1990లో భారత జట్టులో కీలక ఆటగాడిగా ప్రభాకర్ ఉన్నాడు. అతడు తన అంతర్జాతీయ కెరీర్లో 3500 పరుగులతో పాటు 253 వికెట్లు సాధించాడు. "భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించడం జరిగింది. ప్రభాకర్ భారత్ తరపున 39 టెస్ట్ మ్యాచ్‌లు, 130 వన్డేలల్లో ఆడాడు. అతడికి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. నేపాల్ జట్టును ఉన్నతమైన జట్టుగా తీర్చుదిద్దుతారని ఆశిస్తున్నాము" అని క్రికెట్ నేపాల్ ట్విటర్లో పేర్కొంది. చదవండి: Hardik Pandya: టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా..! కచ్చితంగా సిద్ధమే.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో.. -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆలౌట్..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును అండర్-19 నేపాల్ మహిళల జట్టు నమోదు చేసింది. శనివారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నేపాల్ మహిళల జట్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్ కేవలం ఎనిమిది పరుగులకే ఆలౌటైంది. తద్వారా క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్‌కే ఆలౌటైన జట్టుగా నేపాల్ నిలిచింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. నేపాల్ తరఫున స్నేహ మహారా 3 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక యుఎఈ బౌలర్లలో నాలుగు ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఇక 9 పరుగుల లక్ష్యాన్ని 1.1 ఓవర్లలో యుఎఈ చేధించింది. కాగా జూన్ 3న (శుక్రవారం) తమ మునుపటి మ్యాచ్‌లో నేపాల్ ఖతార్‌పై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ ఖతార్‌ను 38 పరుగులకే ఆలౌట్ చేసింది. చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్.. తొలి ఆటగాడిగా..! -
ధర్మశాలలో నేపాల్ జట్టు
న్యూఢిల్లీ : ఘోర భూకంపం అనంతరం నేపాల్ దేశస్తులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోవైపు ఆ దేశ క్రికెట్ జట్టు కూడా తిరిగి ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టింది. అయితే అక్కడి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో 22 మంది సభ్యులున్న జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ప్రపంచ టి20 క్వాలిఫయర్స్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ధర్మశాల క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ ఆరంభించారు. ‘భూకంప విషాదం నుంచి కోలుకుంటున్నాం. అందులో భాగంగానే తిరిగి ఆటపై దృష్టి పెట్టాం. మాకీ సౌకర్యం కల్పించినందుకు బీసీసీఐ, అనురాగ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు. ఇక్కడి సదుపాయాలు ప్రపంచస్థాయిలో ఉన్నాయి. రెండు వారాల శిక్షణలో మా ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తాం’ అని కెప్టెన్ పారస్ ఖడ్కా అన్నాడు.