
చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు నేపాల్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2023 ఫైనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టును ఓడించిన నేపాల్.. ఈ ఏడాది ఆసియాకప్‌కు క్వాలిఫై అయింది. భారత్, పాకిస్తాన్ ఉన్న గ్రూపు-ఏలో నేపాల్ చేరింది.
నేపాల్ జట్టు ప్రకటన..
ఇక ఈ మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నేపాల్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ పాడెల్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో సందీప్ లామిచానే, కుశాల్ మల్లా వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో నేపాల్ పెద్దగా రాణించలేకపోయింది. పాకిస్తాన్-ఏ, భారత్-ఏ వంటి జట్ల చేతిలో నేపాల్ ఓటమి పాలైంది.
కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై మాత్రం అద్భుత విజయం సాధించింది. ఇక ఆసియాకప్-2023లో నేపాల్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.
ఆసియా కప్ 2023కు నేపాల్ జట్టు - రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, కుసల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, భీమ్ షర్కీ, కుశాల్ మల్లా, డి.ఎస్. ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కె.సి., గుల్షన్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, కె. ప్రతీస్ జి.సి. మహతో, సందీప్ జోరా, అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్
చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. !
Comments
Please login to add a commentAdd a comment