టీ20 ప్రపంచకప్-2024లో నేపాల్ జట్టు ఆడే చివరి రెండు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే అందుబాటులోకి రానున్నాడు.
గతంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఎనిమిదేళ్ల జైలు శిక్షకు గురై... ఆ తర్వాత ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి విముక్తి పొందిన లమిచానేకు అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది.
దాంతో అతను అమెరికా వేదికగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నేపాల్ తమ చివరి రెండు మ్యాచ్‌లను వెస్టిండీస్ వేదికగా ఆడనుంది. ఈనెల 15న దక్షిణాఫ్రికాతో, 17న బంగ్లాదేశ్‌తో కింగ్స్‌టౌన్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సందీప్ లమిచానే ఇప్పటికే వెస్టిండీస్‌కు చేరుకున్నాడు.
కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సందీప్ లమిచానే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్ స్పిన్ బౌలర్.. నేపాల్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 52 టీ20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 51 వన్డేలు ఆడి 112 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూప్-డిలో ఉన్న నేపాల్ నెదర్లాండ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడింది. ఇందులో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తదుపరి జూన్ 12న శ్రీలంకతో ఫ్లోరిడా వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా సందీప్ దూరంగా ఉండనున్నాడు.
టీ20 ప్రపంచకప్-2024 కోసం నేపాల్ ప్రకటించిన జట్టు
రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.
సందీప్ లమిచానే
Comments
Please login to add a commentAdd a comment