Sandeep Lamichhane
-
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్.. రషీద్ ఖాన్ తర్వాత..!
నేపాల్ లెగ్ స్పిన్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి నేపాల్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ తర్వాత ఈ ఫీట్‌ను సాధించిన రెండో వేగవంతమైన (మ్యాచ్‌ల పరంగా) బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (4-1-17-2) ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకేందుకు రషీద్ ఖాన్‌కు 53 మ్యాచ్‌లు అవసరం కాగా.. సందీప్ తన 54వ మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మార్కును తాకిన బౌలర్ల జాబితాలో రషీద్, సందీప్ తర్వాత వనిందు హసరంగ (63), హరీస్ రౌఫ్ (71) ఉన్నారు.బంగ్లాతో మ్యాచ్‌లో సందీప్ 100 వికెట్ల మైలురాయిని అందుకోవడంతో పాటు మరో రికార్డు కూడా సాధించాడు. ప్రపంచ క్రికెట్లో వన్డే, టీ20ల్లో 100 వికెట్ల మార్కును అందుకున్న తొమ్మిదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (42 మ్యాచ్‌ల్లో) సాధించిన ఘనత సందీప్ పేరిటే ఉంది. సందీప్.. రషీద్ ఖాన్‌తో పాటు ఈ రికార్డును పంచుకున్నాడు.2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సందీప్.. ఒక్క సౌతాఫ్రికా మినహా తాను ఆడిన ప్రతి దేశంపై వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం సందీప్ ఖాతాలో 112 వన్డే వికెట్లు (51 మ్యాచ్‌ల్లో), 100 టీ20 వికెట్లు (54 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. సందీప్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన అతను 13 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గెలవడంతో బంగ్లాదేశ్ గ్రూప్-డి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వని నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటై హోర పరాజయాన్ని మూటగట్టుకుంది. -
T20 WC 2024: నేపాల్ జట్టుకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్-2024లో నేపాల్ జట్టు ఆడే చివరి రెండు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే అందుబాటులోకి రానున్నాడు. గతంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఎనిమిదేళ్ల జైలు శిక్షకు గురై... ఆ తర్వాత ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి విముక్తి పొందిన లమిచానేకు అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది.దాంతో అతను అమెరికా వేదికగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నేపాల్ తమ చివరి రెండు మ్యాచ్‌లను వెస్టిండీస్ వేదికగా ఆడనుంది. ఈనెల 15న దక్షిణాఫ్రికాతో, 17న బంగ్లాదేశ్‌తో కింగ్స్టౌన్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సందీప్ లమిచానే ఇప్పటికే వెస్టిండీస్‌కు చేరుకున్నాడు.కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందీప్ లమిచానే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్ స్పిన్ బౌలర్.. నేపాల్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 52 టీ20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 51 వన్డేలు ఆడి 112 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూప్-డిలో ఉన్న నేపాల్ నెదర్లాండ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడింది. ఇందులో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తదుపరి జూన్ 12న శ్రీలంకతో ఫ్లోరిడా వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా సందీప్ దూరంగా ఉండనున్నాడు.టీ20 ప్రపంచకప్-2024 కోసం నేపాల్ ప్రకటించిన జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.సందీప్ లమిచానే -
సందీప్ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్‌కప్ జట్టులో చోటు?
క్రిమినల్ కేసు నుంచి నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానేకు హైకోర్టు లో పెద్ద ఊరట లభించింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో ఖాట్మండు జిల్లా కోర్టు విధించిన 8 ఏళ్ల జైలు శిక్షను పటాన్ హైకోర్టు రద్దు చేసింది.నేపాల్ మాజీ కెప్టెన్ లమిచానే 2022 ఆగస్టు 21న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఖాట్మండు కోర్టు అతనికి రూ. 3 లక్షలు జరిమానా, మరో రూ. 2 లక్షలు బాధితురాలికి పరిహారంతో పాటు 8 ఏళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది.బెయిల్‌పై బయటికి వచ్చిన లమిచానే కేసును బుధవారం విచారించిన హైకోర్టు కింది కోర్టు శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 23 ఏళ్ల లమిచానే నేపాల్ తరఫున 51 వన్డేలు ఆడి 112 వికెట్లు, 52 టి20లు ఆడి 98 వికెట్లు తీశాడు. వరల్డ్‌కప్ జట్టులోఇక సందీప్ లమిచానే నిర్దోషిగా తేలడంతో అతడు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే నేపాల్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం నేపాల్ ప్రకటించిన జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ. -
అత్యాచారం కేసు: నేపాల్ క్రికెటర్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష
Sandeep Lamichhane sentenced: నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే జైలు పాలయ్యాడు. అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఎనిమిదేళ్ల శిక్షను ఖరారు చేస్తూ స్థానిక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అదే విధంగా.. రూ. 3 లక్షల జరిమానా విధించడంతో పాటు.. బాధితురాలికి పరిహారం కింద రూ. 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఒకప్పటి కెప్టెన్ కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందీప్ లమిచానే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్ స్పిన్ బౌలర్.. నేపాల్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 52 టీ20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు ఓవరాల్‌గా ఈ ఫార్మాట్లో 75 మ్యాచ్‌లలో కలిపి 158 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు సందీప్. ఇందులో మూడు ఫైవ్ వికెట్స్ హాల్స్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన తొలి నేపాలీ క్రికెటర్‌గా ప్రసిద్ధి పొందిన సందీప్ లమిచానే.. 2018-20 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ 23 ఏళ్ల స్పిన్నర్ 13 వికెట్లు తీశాడు. అప్పట్లోనే అరెస్ట్ ఆటగాడిగా కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకునే సమయంలో అత్యాచార ఆరోపణలతో సెప్టెంబరు, 2022లో అరెస్టయ్యాడు. మూడు నెలల తర్వాత కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు. శిక్షను తాజాగా ఖరారు చేసిన కోర్టు అయితే, తాజాగా ఈ కేసు విచారణకు రాగా కాఠ్మండు జిల్లా కోర్టు సందీప్ లమిచానేకు ఎనిమిదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా డిసెంబరు 29నాటి విచారణలో భాగంగా జస్టిస్ శిశిర్ రాజ్ ధాకల్ నేతృత్వంలోని ధర్మాసనం అతడిని దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌తో పాటు బీబీఎల్, పీఎస్ఎల్, బీపీఎల్, సీపీఎల్ వంటి టీ20 లీగ్‌లలో సందీప్ లమిచానే పాల్గొన్నాడు. చదవండి: Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్ -
అత్యాచారం కేసులో దోషిగా తేలిన అంతర్జాతీయ క్రికెటర్
మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచ్చెన్‌ను ఖాట్మండు జిల్లా కోర్డు దోషిగా తేల్చింది. గతేడాది ఆగస్టులో ఖాట్మండులోని ఓ హోటల్ గదిలో సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మైనర్ బాలిక కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్న సందీప్‌ను ఈ ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదల చేశారు. అప్పటినుంచి ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సందీప్‌ను తాజాగా ఖాట్మండు కోర్టు దోషిగా నిర్ధారించింది. తదుపరి విచారణలో సందీప్‌కు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 23 ఏళ్ల సందీప్ ఐపీఎల్ ఆడిన తొలి నేపాల్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. సందీప్.. ఐపీఎల్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ల్లో కూడా వేర్వేరే ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. నేపాల్ క్రికెటర్‌గా సందీప్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు ఉంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సందీప్ నేపాల్ తరఫున 51 వన్డేలు, 52 టీ20లు ఆడి 3256 పరుగులు చేశాడు. అలాగే 210 వికెట్లు కూడా పడగొట్టాడు. -
సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు!
IND vs NEP Asia Cup 2023- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. మనతో మాట్లాడుతున్న వాళ్లు ఎలాంటి వారో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా అంటూ విమర్శిస్తున్నారు. నీలాంటి స్టార్లు ఇలాంటి పని చేసే ముందుకు ఒక్కసారైనా ఆలోచించాలంటూ హితవు పలుకుతున్నారు. అండగా అభిమానులు అయితే, హిట్‌మ్యాన్ అభిమానులు మాత్రం.. ‘‘యువ ఆటగాడిని ప్రోత్సహించే క్రమంలో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించినా తప్పేనా?’’ అని ట్రోల్స్‌కు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఆసియా కప్-2023లో గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా.. సోమవారం నేపాల్‌తో తలపడిన విషయం తెలిసిందే. శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు సారథి రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, వర్షం ఆటంకం కలిగించిన కారణంగా వికెట్ నష్టపోకుండా 147 పరుగులు చేసిన రోహిత్ సేన డీఎల్ఎస్ పద్ధతిలో విజయం సాధించింది. ఊహించని సర్ప్రైజ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-4లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మ్యాచ్‌లో నేపాల్.. టీమిండియాతో తలపడటం ఇదే తొలిసారి. ఇలా మొదటిమ్యాచ్లోనే పటిష్ట భారత జట్టుకు సవాల్ విసిరిన పసికూనకు.. టీమిండియా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు నేపాల్ డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లి మెడల్స్‌తో సత్కరించారు. ఈ క్రమంలో.. నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానే రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి తన జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిగ్గుపడు రోహిత్ ఇది గమనించిన నెటిజన్లు.. ‘‘సిగ్గుపడాలి రోహిత్ శర్మ.. జీవితంలో నువ్వు చేసిన చెత్త పని ఇదే అనుకుంటా! నువ్వసలు మా కెప్టెన్‌వే కాదు’’ అంటూ ట్రోల్ చేశారు. కాగా సందీప్ లమిచానేపై అత్యాచార(మైనర్‌పై) ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో అతడు అరెస్టయ్యాడు కూడా! అయితే, స్థానిక కోర్టు షరతులకు లోబడి బెయిల్‌పై విడుదలైన సందీప్‌పై నేపాల్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం ఎత్తివేయగా.. స్కాట్లాండ్, నమీబియాలతో ట్రై సిరీస్ నేపథ్యంలో క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో నమీబియా, స్కాట్లాండ్ ఆటగాళ్లు మ్యాచ్ ముగిసిన తర్వాత సందీప్నకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా.. నిరసన వ్యక్తం చేశారు. వాళ్లకు ఉన్న బుద్ధి నీకు లేదు మహిళలపై హింస, లింగవివక్షకు వ్యతిరేకంగా అతడికి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయం గురించి సందీప్నకు నేపాల్ క్రికెట్ బోర్డు ముందే చెప్పగా.. అతడు కూడా వారికి దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాంటిది.. ఇప్పుడు రోహిత్ శర్మ ఏకంగా అతడితో ఫొటోలు దిగడం సహా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం క్రికెట్ అభిమానులకు నచ్చడం లేదు. రోహిత్ లాంటి స్టార్లు ఇలాంటి వ్యక్తులతో సన్నిహితంగా కనబడటం పరోక్షంగా వారిని ప్రోత్సహించినట్లే అవుతుందని మండిపడుతున్నారు. కాగా నేపాల్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. 74 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం Sandeep Lamichhane taking Indian Captain Rohit Sharma's autograph on his shirt. - The Hitman always there for youngsters - The Icon! pic.twitter.com/SOq7LSAgLk — CricketMAN2 (@ImTanujSingh) September 5, 2023 what a shame ... someone tell Rohit about him — Ishaan (@Ishaan_s8) September 5, 2023 Virat refused to shake hands with him but Rohit js shamelessly posing with this rape accussed. Even minnow scottish players are of better standard than Rohit Sharma. Shame. — Avishek Goyal (@AG_knocks) September 5, 2023 -
చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెటర్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
కీర్తిపూర్ (నేపాల్): అంతర్జాతీయ వన్డేల్లో నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానె అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సందీప్ లమిచానె ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్ టోర్నీలో భాగంగా ఒమన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సందీప్ మూడు వికెట్లు తీశాడు. తద్వారా ఈ ఘనతను సందీప్ పేరిట లిఖించుకున్నాడు. 100 వికెట్ల మైలు రాయిని సందీప్ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (44 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రషీద్ రికార్డును సందీప్ బ్రేక్ చేశాడు. చదవండి: ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు ధోని సలహాలు.. జ్ఞానోదయం కలిగేనా! -
ఛీ.. నీతో షేక్‌హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు
ICC Cricket World Cup League Two 2019-23- Nepal won by 3 wkts: నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానేకు ఘోర అవమానం జరిగింది. జట్టులోని ఇతర ప్లేయర్లతో కరచాలనం చేసిన ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు.. కావాలనే సందీప్‌ను విస్మరించారు. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పక్కకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట ప్రత్యక్షం కాగా.. ‘‘తగిన శాస్తే జరిగింది. నీలాంటి వాళ్లకు ఇలాంటి ఘటనలు ఎదురైతేనన్నా కాస్త బుద్ధి వస్తుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్, నమీబియా నేపాల్ పర్యటనకు వచ్చాయి. ఈ మూడు జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆతిథ్య నేపాల్- పర్యాటక స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన నేపాల్ బౌలింగ్ ఎంచుకోగా.. స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మూడు వికెట్ల తేడాతో గెలుపు లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు 47 ఓవర్లనే పని ముగించింది. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన కుశాల్ మల్ల 81 పరుగులతో చెలరేగగా.. ఏడో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఐరే 85 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నేపాల్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో నేపాల్ జట్టును అభినందించే క్రమంలో స్కాట్లాండ్ ఆటగాళ్లు సందీప్ లమిచానేతో కరచాలనం చేసేందుకు విముఖత చూపారు. తమ చర్యతో సందీప్ పట్ల తమకున్న భావనను తెలియజేశారు. ఇందుకు కారణం ఏమిటంటే.. నేపాల్ కెప్టెన్ సందీప్ గతేడాది అత్యాచార ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం బెయిల్ మీద విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం షరతులకు లోబడి నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో ట్రై సిరీస్ ఆడేందుకు అనుమతినిచ్చింది. అయితే, కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం రోహిత్ పౌడేల్‌కు అప్పగించింది. ఇక స్కాట్లాండ్తో మ్యాచ్‌లో రైట్ఆర్మ్ స్పిన్నర్ సందీప్ లమిచానే మూడు వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల యువ బౌలర్ 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి అందరికంటే మెరుగైన ప్రదర్శన (ఎకానమీ 2.70) కనబరిచాడు. అయితే, ఆటలో రాణించినా వ్యక్తిత్వంపై పడిన మచ్చ కారణంగా ఇలా అవమానం ఎదుర్కోకతప్పలేదతడికి! హింసకు వ్యతిరేకంగానే అంతకుముందు నమీబియా ఆటగాళ్లు కూడా సందీప్ పట్ల ఇలాగే వ్యవహరించారు. కాగా లింగ వివక్ష పూరిత హింసకు వ్యతిరేకంగా స్కాట్లాండ్, నమీబియా బోర్డుల సూచన మేరకే ఆటగాళ్లు ఈ మేరకు సందీప్‌తో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించినట్లు తెలుస్తోంది. నేపాల్ బోర్డు సెలక్షన్‌తో తమకు పనిలేదని, అయితే, మహిళలపై హింసకు వ్యతిరేకంగా తమ స్పందన తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సందీప్నకు నేపాల్ బోర్డు ముందే చెప్పడంతో అతడు కూడా వారికి దూరంగా ఉన్నట్లు ఈఎస్పీఎన్ తన కథనంలో పేర్కొంది. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్ ఆమే.. ప్రకటించిన కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్.. వీడియో వైరల్ IND vs AUS: ఇదేమి బాల్‌రా బాబు.. దెబ్బకు రోహిత్ శర్మ షాక్! వైరల్ Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం.. Scotland Cricket Team refuses after match handshake with Sandeep Lamichhane. सन्दीप लामिछानेसँग हात मिलाएनन् स्कटिस खेलाडीलेhttps://t.co/bajsRRvfcDpic.twitter.com/mv3LHF4vYa — NepalLinks ︎ (@NepaliPodcasts) February 17, 2023 -
సందీప్ లమిచానేకు భారీ ఊరట.. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం
Sandeep Lamichhane: నేపాల్ క్రికెట్ అసోసియేషన్ తమ ఆటగాడు సందీప్ లమిచానేకు భారీ ఊరట కలిగించింది. అతడిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న నేపాల్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2 ట్రై సిరీస్‌లో ఆడేందుకు లమిచానేకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ బ్రిటాంట్ ఖనాల్ ధ్రువీకరించాడు. అత్యాచార ఆరోపణలతో అరెస్టు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన ఖనాల్.. కోర్టు షరతులకు లోబడే ప్రస్తుతం అతడిని స్వదేశంలో సిరీస్ ఆడేందుకు అనుమతించామని పేర్కొన్నాడు. ఒకవేళ నేపాల్ జట్టు విదేశాల్లో సిరీస్ ఆడేందుకు వెళ్లాల్సి వస్తే న్యాయస్థానం చెప్పినట్లుగానే నడుచుకుంటామని స్పష్టం చేశాడు. కాగా 22 ఏళ్ల సందీప్ లమిచానే అత్యాచార ఆరోపణలతో గతేడాది సెప్టెంబరులో అరెస్టైన సంగతి తెలిసిందే. బెయిలు మంజూరు ఈ క్రమంలో దాదాపు మూడు నెలల పాటు జైల్లో ఉన్న అతడికి ఇటీవలే పఠాన్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో విముక్తి లభించింది. అయితే, తీర్పు వచ్చేంత వరకు దేశం వదిలివెళ్లొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ మేరకు అతడిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో స్వదేశంలో నమీబియా, స్కాట్లాండ్తో జరుగనున్న ట్రై సిరీస్‌లో అతడు ఆడనున్నాడు. సుప్రీంకోర్టుకు వెళ్తాం కాగా నేపాల్ కెప్టెన్‌గా ఉన్న సందీప్ లమిచానే.. ఐపీఎల్ సహా బీబీఎల్, పీఎస్ఎల్, బీపీఎల్, సీపీఎల్ వంటి టీ20 లీగ్‌లలో ఆడాడు. ఇదిలా ఉంటే లమిచానేకు బెయిల్ లభించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అటార్నీ జనరల్ ఆఫీస్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపినట్లు ట్రిబ్యూన్ పేర్కొంది. చదవండి: Suryakumar Yadav: దుమ్ములేపిన సూర్య.. అదే జరిగితే మలన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు Johnson Charles: విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం -
నేపాల్ స్టార్ క్రికెటర్‌కు ఊరట.. కానీ ఓ కండిషన్!
Sandeep Lamichhane: అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానేకు కాస్త ఊరట లభించింది. 22 ఏళ్ల లమిచానేకు నేపాల్ పఠాన్ కోర్టు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు నెలల తర్వాత అతడికి విముక్తి లభించింది. అయితే, ఈ కేసులో అంతిమ తీర్పు వెలువడేంత వరకు దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది. కాగా అత్యాచార ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబరు 8న నేపాల్ కోర్టు.. లమిచానేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే, తాను ఏ తప్పు చేయలేదంటూ, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ లమిచానే చెప్పుకొచ్చాడు. కానీ, విచారణ పూర్తయ్యేంతవరకు అతడిని సస్పెండ్ చేస్తూ నేపాల్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా అరెస్టయ్యే సమయానికి అతడు నేపాల్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఆడుతున్న సమయంలో ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో వెస్టిండీస్ నుంచి నేపాల్‌కు వచ్చాడు. చదవండి: Delhi vs Andhra: సెంచరీతో చెలరేగిన ధ్రువ్ షోరే... ఢిల్లీ దీటైన జవాబు -
తీర్పు వచ్చేవరకు జ్యుడీషియల్ కస్టడీలో నేపాల్ క్రికెటర్
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న సందీప్ లమిచానేను ఇంటర్‌పోల్ సహాయంతో స్వదేశానికి రప్పించిన నేపాల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి పోలీసుల అదుపులో ఉన్న సందీప్‌పై విచారణ కొనసాగుతుంది. తాజాగా కేసులో తుది తీర్పు వచ్చేవరకు లమిచానే జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని ఖాట్మండు జిల్లా కోర్టు స్పష్టంచేసింది. కాగా, సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గత ఆగస్టులో 17 ఏండ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం సెప్టెంబర్ 8న సందీప్ లమిచానే అరెస్ట్ కోసం వారెంట్ జారీచేసింది. అయితే ఆ సమాయానికి సందీప్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ జమైకాలో ఉన్నాడు. దాంతో పోలీసులు లీగ్ నిర్వాహకులకు విషయం తెలియజేయడంతో అతడిని టోర్నీ నుంచి తప్పించారు. జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉన్న సందీప్ లమిచానేను నేపాల్ క్రికెట్ బోర్డు కూడా జట్టులో నుంచి తొలగించింది. చదవండి: డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఆసీస్‌కు ముచ్చెమటలు